చేనేత వృత్తి పరిరక్షణ కోసం 2000 వేల కోట్లు కేటాయించాలి

Download Post





5 months, 1 week

చేనేత వృత్తి పరిరక్షణ కోసం 2000 వేల కోట్లు కేటాయించాలి

చేనేతలను విస్మరిస్తూ, రాష్ట్ర కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో చేనేత పరిశ్రమకు జరిగిన అన్యాయాన్ని ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తుందని, ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు బండారు ఆనంద ప్రసాద్ అన్నారు. శనివారం మంగళగిరి పట్టణంలోని ఐబీఎన్ భవన్ ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో ఆనంద్ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర కూటమి ప్రభుత్వం చేనేతలకు అన్యాయం చేసిందని ఆయన మండిపడ్డారు. గత ప్రభుత్వం వైయస్సార్ నేతన్న నేస్తం పేరుతో ప్రతి సంవత్సరం 24 వేల రూపాయల చొప్పున సుమారు 80000 మంది చేనేత కార్మికులకు నేరుగా బ్యాంక్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేస్తే అప్పటి ప్రతిపక్ష నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు లక్షల మంది చేనేత కార్మికులు ఉన్నారని వైసీపీ ప్రభుత్వం కేవలం 80,000 మందికే నేతన్న నేస్తం అమలు చేయడం దారుణమని మొత్తం మూడు లక్షల మందికి చేనేత కార్మికులకు నేతన్న నేస్తం ఇవ్వాలని అనేక సందర్భాలలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు   వ్యాకనించారని ఆయన అన్నారు. అంతేకాకుండా అప్పటి ప్రతిపక్ష పార్టీ నాయకులు చేనేత పరిశ్రమకు ఆయు పట్టు అయినటువంటి చేనేత సహకార సంఘాలను గత వైసిపి ప్రభుత్వం పూర్తిగా విస్మరించారని చేనేత పరిశ్రమ నాశనం అవుతుందని అనేక సందర్భాలలో అనేక వేదికలపై వివరించారని, కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించిన ప్రకారం నేతన్న నేస్తం పథకాన్ని పూర్తిగా ఎత్తివేసినట్లుగా అర్థమవుతుందని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చేనేత సహకార సంఘం కాపాడుతామని చేనేత పరిశ్రమకు పునర్జీవం పోస్తామని, అనేక వేదికలపై ఇచ్చిన హామీలను ఎన్నికల సందర్భంలో చేసిన హామీలు ఏమయ్యాయని కూటమి అధి నాయకులతోపాటు కూటమి ప్రభుత్వంలో పదవులు పొందిన నాయకులు సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. చీరాలలో జరిగిన ఎన్నికల సభలో అప్పటి ప్రతిపక్ష నాయకుడు ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేనేత కార్మికులందరికీ ప్రతి సంవత్సరం 24 వేల రూపాయలు అందిస్తామని స్వయంగా ప్రకటించారు కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక చెప్పిన హామీలను పూర్తిగా విస్మరించడం, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చేనేతలను మోసం చేయడమే అని ఆయన అన్నారు. గత రాష్ట్ర ప్రభుత్వం చేనేత సామాజిక వర్గాల వారందరికీ కుల కార్పొరేషన్ ఏర్పాటు చేయగా ఇప్పుడు ఏర్పడిన కూటమి ప్రభుత్వం కేవలం ఒక చేనేత సామాజిక వర్గం వారికే కార్పొరేషన్ ఏర్పాటు చేసి మిగిలిన చేనేత సామాజిక వర్గాల వారిని విస్మరించడం చాలా దారుణం అని ఇప్పటివరకు పరస్పర అవగాహనతో అన్నదమ్ముల్లా ఉన్న చేనేత కులాల మధ్య అంతరాలు పెంచే విధంగా ఈ ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తుందని ఆయన అన్నారు. మంగళగిరి ప్రాంతంలో కొంతమందికి పదవులు ఇస్తే చేనేత పరిశ్రమకు న్యాయం చేసినట్లు కాదని, చేనేత పరిశ్రమకు రాష్ట్ర బడ్జెట్లో చేనేతకు అధిక కేటాయింపులు జరిపించి చేనేత పరిశ్రమను చేనేత సహకార సంఘాలను చేనేత కార్మికులను ఆదుకుంటేనే చేనేతలకు న్యాయం చేసినట్లుగా భావిస్తామని ఆయన అన్నారు. గత రెండు నెలల క్రితం చేనేత శాఖామంత్రి సవితాను ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ ప్రతినిధులు చర్చలు జరపకా ఆమె పరిశ్రమను పునరుద్ధరించేందుకు అనేక హామీలు అమలు చేస్తామని చెప్పారు కానీ చేనేత శాఖ మంత్రి స్వయంగా చెప్పిన మాటలకు కూడా విలువ లేకుండా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని అంటే బీసీ మంత్రులకు పదవులు తప్ప అధికారం లేవని ఆధిపత్య కులాలైన, పార్టీ అగ్ర నాయకుల చేతిలోనే అధికారాలు ఉంచుకుని పరిపాలన చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా చేనేత వృత్తి పరిరక్షణకు రెండువేల కోట్లు కేటాయించి రాష్ట్రంలో ఉన్న చేనేత కార్మికులందరికీ నేతన్న నేస్తం పథకాన్ని అమలు చేయాలి చేనేత కార్మికులకు ఆరోగ్య భీమా పథకాన్ని అమలు చేయాలి చేనేత సహకార సంఘ వ్యవస్థను కాపాడే విధంగా సహకార సంఘాలకు ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలను విడుదల చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షులు ఇనమాల శివరాం ప్రసాద్, చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి నాగేశ్వరరావు,  వాస పల్లపు రాజు, రామనాథం పరమేశ్వరరావు, బల్ల వెంకటరమణ, గుర్రం చిన్న వీరయ్య, బత్తూరి మోహనరావు, అల్లక తాతారావు, వినాయకరావు, గజవల్లి వెంకట కృష్ణారావు, దొడ్డి ఈశ్వరరావు, నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.