Download Post
5 months, 3 weeks
తిరుపతి పద్మశాలి సంక్షేమ సంఘము ఆధ్వర్యంలో 23 వ వార్షికోత్సవ వన భోజన మహోత్సవము మరియు శ్రీ భద్రావతి సమేత బావనా ఋషి కళ్యాణోత్సవము శ్రీనివాస మంగాపురం లోని టీటీడీ కల్యాణ మండపంలో 03-11-2024 (ఆదివారం )అద్భుతంగా జరిగినది. ఈ కార్యక్రమంలో తిరుపతి పట్టణంతో పాటు సమీప గ్రామం అయిన రేణిగుంట, తిరుచానూరు, చంద్రగిరి మొదలగు గ్రామంలోని పద్మశాలి కుల బంధువులు అందరూ కుటుంబ సమేతంగా హాజరైనారు . ఈ కార్యక్రమము ఉదయం పులిజెండా ఆవిష్కరణతో మొదలయ్యి సత్యనారాయణ వ్రతము, భద్రావతి సమేత భావన ఋషి కళ్యాణోత్సవం మొదలగు కార్యక్రమములు అత్యంత కోలాహలంగా జరిగినవి. పలు సాంస్కృతిక కార్యక్రమాలు అనగా పురుషులకు, స్త్రీలకు విడివిడిగా ఆటల పోటీలు, రంగవల్లుల పోటీలు, భరతనాట్యం పోటీలు మొదలగునవి నిర్వహించడమైనది. చదువులో అద్భుత ప్రతిభ కనబరిచిన పదవ తరగతి , ఇంటర్మీడియట్ మొదటి మరియు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు నగదు బహుమతితో పాటు ప్రశంసాపత్రం ఇవ్వడం జరిగినది.
ఈ రోజు ప్రతిభ పురస్కారంఅందుకున్న చిన్నారులు
*ఇంటర్ రెండవ సంవత్సరం
బోడగలమైత్రి శ్రీ.. 981/1000
గోసంగి నిఖిల శ్రీ 959/1000
పైడి పూర్ణిమ 952/1000
_______
*ఇంటర్ మొదటి సంవత్సరం
శ్రీరామ రోహిత్.. 462/470
చింత విజయ దుర్గ 460/470
జంజం తేజశ్రీ 459/470
_______
*10 వ తరగతి
*వర్ది శ్రీనివాస హిమ కుమార్ 470/500
*అవ్వరు గురు జీవన 579/600
*తంగెళ్ల ఊహ 590/600
వీరికి ప్రతిభ పూరస్కారం అందించబడినది
సాంస్కృతిక కార్యక్రమాలలో గెలిచిన వారికి బహుమతులు ఇవ్వడం జరిగినది. లక్కీ డిప్ ద్వారా ముగ్గురికి ప్రైజులు ఇవ్వడం జరిగినది. శ్రీ సామా వెంకట సుబ్బయ్య గారు, తిరుపతి పద్మశాలి సంఘం మాజీ కార్యదర్శి, కార్యక్రమమునకు హాజరైన పద్మశాలి పిల్లలకు లాంగ్ నోట్ బుక్స్-250 మరియు పెన్నులు-200 పంపిణీ చేశారు. హాజరైన పద్మశాలి కుల బంధువులకు ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ మరియు సాయంత్రం స్నాక్స్ ని అరేంజ్ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో తిరుపతి పద్మశాలి సంఘం తరఫున శ్రీ సేపూరి రామ్మోహన్ గారు ( ప్రెసిడెంట్), శ్రీ ఇప్పనపల్లి శేషయ్య గారు( సెక్రెటరీ), శ్రీ హేమాద్రి గారు ట్రెజరర్ మరియు గౌరవ అధ్యక్షులు, సభ్యులు అందరూ హాజరై కార్యక్రమమును విజయవంతంగా జరిపినారు. ఈ కార్యక్రమం కు హాజరైన పద్మశాలి కుల బాంధవులందరికీ కృతజ్ఞతలు తెలపడం అయినది.