Download Post
5 months
అనంతపురం జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో 24-11-2024 ఆదివారం కార్తీకమాస వనభోజనాలు కార్యక్రమం రాచానపల్లి వద్ద వనం నందు అక్కమ్మ గార్ల దేవాలయం ముందు అత్యంత ఘనంగా జిల్లా అధ్యక్షులు జింకా సూర్యనారాయణ గారి సారథ్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంకు ముఖ్యఅతిథులుగా ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంక్షేమ అభివృద్ధి రాష్ట్ర డైరెక్టర్ పోతుల లక్ష్మినరసింహులు గారు హాజరై ప్రసంగిస్తూ మనమందరం కలవడానికి, ఆటపాటలు పిల్లలు, పెద్దలు ఆడటం ఇలాంటి వనభోజనాల కార్యక్రమం బాగా ఉపయోగపడుతుందన్నారు. మన పద్మశాలి ఉద్యోగులు, చేనేతలు, వివిధ పనులు చేసుకుంటూ మనమందరం జీవిస్తున్నామని ఇలా ఒకరోజు పనులు అన్ని ప్రక్కనపెట్టి కులబాంధవులు కలసిమెలసి కష్టసుఖాలు మరచి మనమందరం ఆహ్లాద వాతావరణంలో గడపడం చాలా ఆనందదాయకం అన్నారు. ఈమధ్యకాలంలో మన పద్మశాలీయులు అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలను వెళ్లి పరామర్శించడం, వారికి ఆర్థికంగా సహాయపడుతున్నామని, అనారోగ్యంతో బాధపడుతున్న గుర్రం రమేష్ కు , గుండెపోటుతో మరణించిన పొడరాళ్ళ వెంకటేష్ కుటుంబాలకు కూడా ఆర్ధిక సహాయాలకు మన పద్మశాలీయులు కూడా సహకారం అందించడం అభినందనీయం అన్నారు. అందరం వారి వారి పనులలో ప్రావీణ్యం పొంది ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పద్మశాలీయులకు రాజకీయంగా పెద్దపీట వేయడం గర్వకారణం అన్నారు. ఎంఎల్సీ,నామినేటెడ్ పదవులు మరియు తిరుమల తిరుపతి దేవస్థానం నందు పాలక మండలి సభ్యురాలిగా మన పద్మశాలి ఆడపడుచును ఎంపిక చేయడంలో నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ లకు కృతజ్ఞతలు తెలిపారు. చాలా కాలం తర్వాత మమ్ములను గుర్తించి ఆదరించిన కూటమి ప్రభుత్వంకు రుణపడి ఉన్నామన్నారు. ఆటల పోటీలను నిర్వహించిన గుర్రం యుగంధర్, గోరంట్ల చలపతి, సాయి,శీల వెంకటస్వామి,శీలా రఘు, వంట, భోజన ఏర్పాట్లు దగ్గరుండి పర్యవేక్షించిన జానపాటి సత్యనారాయణ, దేవరకొండ నరసింహులు, దేవిరెడ్డి రాము, వెంకటేష్, తిమ్మప్ప, నరసింహులు చాలా బాగా నిర్వహించారన్నారు. మన పద్మశాలి వెల్ఫేర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అనంతపురం జిల్లా కమిటీ వారి సహకారం మరువలేనిదన్నారు.బడిగంట శ్రీనివాసులు గారు, కొంతం శివరుద్ర గారు, తాడూరు చంద్రశేఖర్ గారు, గండాబతుల సుజాత గారు మన జిల్లాకే పద్మశాలియులకు పేరుతీసుకువస్తున్నారని కొనియాడారు. అలాగే మన ఇంజమూరి రాహుల్ గారు, డాక్టర్ గురువంశీ కృష్ణ గారు, డాక్టర్ కిరణ్ కుమార్ గారు,ఐటీఐ ప్రిన్సిపాల్ రామమూర్తి గారు తదితరులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని ప్రశంసించారు. పెద్దలు పొడరాళ్ల రవీంద్ గారు,నగర అధ్యక్షులు వగ్గా రాజశేఖర్ గారు, జింకా సత్యనారాయణ గారు,మహేసుల చంద్రశేఖర్ గారు, కాలువ సుబ్బారాయుడు గారు, జక్కా వెంకట్రామయ్య గారు, గోరంట్ల శ్రీనివాసులు గారు, బుక్కరాయసముద్రం రంగనాథ్ గారు, పుత్తా ఎర్రిస్వామి, దేవరకొండ మహేష్, కొండ గారు,మహిళా సంఘం నాయకురాలు జానపాటి సరోజ గారు, మంజుల, రాజేశ్వరి, భావన,పద్మావతి, కళావతి తదితరులు బాగా క్యాంపియన్ చేయడం జరిగిందన్నారు. అనంతరం జిల్లా అధ్యక్షులు జింకా సూర్యనారాయణ,నాగలక్ష్మి దంపతులను పోతుల లక్ష్మినరసింహులు వారి కుటుంబసభ్యులు ఘనంగా గజమాలతో సన్మానించారు.