Download Post
4 months, 3 weeks
తిరుచానూరు పుణ్య క్షేత్రంలో భృగు బ్రాహ్మణ పద్మశాలీయులచే శ్రీ పద్మావతీ దేవి అమ్మవారికి నేడు చీరె సారె, ఆడపడుచు లాంఛనాలు.
▫️
భృగు బ్రాహ్మణ పద్మశాలీ సోదరులారా ! కుల బాంధవులారా !! 108 శ్రీ వైష్ణవ దివ్య క్షేత్రాలలో క్షేత్ర రాజంగా వెలుగొందుతున్న రాయలసీమ ప్రాంత భాగంలోని చిత్తూరు జిల్లాలోని శ్రీ తిరుచానూరు క్షేత్రం నందు. శ్రీ క్రోధి నామ సంవత్సరం కార్తీక మాస అమావాస్య , 30.11.2024 రోజున తిరుచానూరు క్షేత్రం నందు కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా .. పద్మశాలీయుల ఆడపడుచు శ్రీ పద్మావతీ దేవి అమ్మవారికి రాష్ట్ర వ్యాప్తంగా సమస్త పద్మశాలీయులు పుట్టింటి చీర - సారె వంటి ఆడపడుచు లాంఛనాలు జరపడం జరిగినది .
శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల మునిమనుమడైన శ్రీ తాళ్ళపాక చిన వెంగళనాథుడైన చిన్నన్న గారి సమక్షంలో 1541 అక్టోబరు .. 23వ తేదీ ..
గురువారం కార్తీక పౌర్ణమి రోజున ఉదయం11.00 గంటల సమయమున దేదీప్యమైన కాంతులతో సాక్షాత్తు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ గర్భగుడి నుండి " నా పుట్టింటివారు పద్మశాలీ వారు " నా దివ్యక్షేత్రాలలో విశేషమైన దినములలో ,ఉత్సవాలలో పద్మశాలీ వారే ముందుగా సమస్త మర్యాదలు జరిపించవలయును. ప్రప్రథమంగా పద్మశాలీ వారు సమర్పించిన తరువాతనే ఎవరైనా తమ మర్యాదలను సమర్పించుకోవచ్చునని స్వయంగా అమ్మవారే పలుకగా .. ఆనాటి నుండి అన్ని వైష్ణవ క్షేత్రాలలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి మన పద్మశాలీయులే చీర - సారె వంటి ఆడపడుచు లాంచన సమస్త మర్యాదలను ఆనాటి నుండి ఆనవాయితీగా ముందుగా పద్మశాలీయులచే జరిపించు ఆచారాన్ని పొందడం మన పద్మశాలీయులకు గర్వకారణం.
భృగు మహర్షి - ఖ్యాతిదేవిల సంతానమే.. శ్రీ మహాలక్ష్మి దేవి. ఆదిలక్ష్మి అవతారమైన శ్రీ పద్మావతీ దేవి అమ్మవారికి తోబుట్టువులమైనందులకు.. సిరికి పుట్టింటివారము.. హరికి మెట్టింటి వారమైన మన పద్మశాలీ కులస్తులందరూ పుణ్యజీవులము .. అదృష్టవంతులము.
ఈ ప్రకారంగా .. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం సంప్రదాయ సిద్ధముగా జరుగు బ్రహ్మోత్సవములకు సమస్త పద్మశాలీ కుల బాంధవులందరూ భక్తి శ్రద్ధలతో అశేష సంఖ్యలో శ్రీ పద్మావతీ దేవి అమ్మవారికి ఆడపడుచు లాంఛనాలతో అనగా.. అమ్మవారికి పట్టుచీర, రవిక వడిబియ్యం , పూలు , పండ్లు అనాదిగా మన పద్మశాలీయులు ఆచరిస్తూ వస్తున్న సంప్రదాయం ప్రకారం ఈతరం .. పద్మశాలీయులు కూడా ఆచరించి
తరించడం జరిగింది .
ఈనాటి 30.11.2024 తేదీన , మధ్యాహ్నం 03.00 గంటలకు తిరుచానూరు క్షేత్రము నందు శ్రీ మహాలక్ష్మీ దేవి అమ్మవారు ఉద్భవించిన పద్మ సరోవరం సమీపం నందు సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠించిన శ్రీ సూర్య నారాయణ స్వామి ఆలయం మీదుగా మన పద్మావతీ అమ్మవారికి మన చీర-సారె వంటి లాంఛనాలతో, మంగళ వాయిద్యాలతో, భజనలతో, కోలాటాలతో, తన " పద్మశాలీ " పుట్టింటివారి నడుమ శోభాయాత్రగా ఆలయ మాడ వీధులగుండా వెళ్లి చిత్తూరు జిల్లా పద్మశాలీ సంఘం వారి నేతృత్వంలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో.. ఈ.ఓ. గారి పర్యవేక్షణలో మరియు, తిరుచానూరు పీఠాధిపతుల ఆశీర్వచనములతో .. తిరుచానూరు ఆలయమర్యాదలతో సంప్రదాయబద్ధంగా మన ఆడబిడ్డకు
సకల ఆడపడుచు లాంచనాలను ప్రతీ పద్మశాలీ దంపతులు సమర్పించుకొని అమ్మవారి కృపకు పాత్రులమవడం జరిగినది .
శ్రీ పద్మావతీ అమ్మవారికి అత్యంత నియమ నిష్టలతో ఆడపడుచు లాంఛనాలు జరుపు శ్రీ భృగు బ్రాహ్మణ పద్మశాలీయులకు సాక్షాత్ శ్రీ మహాలక్ష్మిదేవియే సర్వ దుఃఖములు , సమస్త పాతకములను తొలగించి, ధన , ధాన్యాభివృద్ధి , ఆయురారోగ్యాలను ఇచ్చి సర్వదా రక్షించునని శాస్త్ర వచనం.