Download Post
4 months, 2 weeks
ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం రాష్ట్ర కో కన్వీనర్ డాక్టర్ మునగపాటి వెంకటేశ్వరరావు గారు మంగళగిరి కి చెందిన చల్లపల్లి శ్రీనివాసరావు గారికి APMSIDC చైర్మన్గా రావటం పట్ల ఆంధ్రప్రదేశ్ పద్మశాలీలు తరఫున శాలువాతో సత్కరించడం జరిగింది వారు ముందు ముందు ఇంకా మంచి పదవులు అధిరోహించాలని పద్మశాలి సామాజిక వర్గం అంతా మీ వెంటే ఉంటుందని మునగపాటి చెప్పటం జరిగింది వీరితోపాటు ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన (APPYS) ప్రతినిధులు*26 జిల్లాల నుంచి వచ్చి వారికి శాలువాలతో సత్కరించడం జరిగింది
యువసేన సేవా కార్యక్రమాలకు ప్రశంస, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడి
పద్మశాలి ప్రముఖులు, ఏపీ మెడికల్ సర్వీసెస్ & ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ ఛైర్మన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు గారిని ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన (APPYS) ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. APMSIDC ఛైర్మన్ గా పదవీభాద్యతలు స్వీకరించిన నేపథ్యంలో దుశ్శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆత్మీయంగా పలకరించిన చిల్లపల్లి శ్రీనివాసరావు గారు.. యువసేన చేపడుతున్న కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న పేద పద్మశాలీలకు చేస్తున్న సేవను ప్రత్యేకంగా అభినందించారు. పేద పద్మశాలీల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న *ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన(APPYS)*కు ఎలాంటి సహాయం కావాలన్నా తాను అందుబాటులో ఉంటానని తెలిపారు. చిల్లపల్లి శ్రీనివాసరావు గారిని కలిసిన వారిలో ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన (APPYS) ప్రతినిధులు గోపిశెట్టి రామాంజనేయులు ఋషి, మునగపాటి రమేష్, పెనుగొండ శ్రీనివాసరావు, గోలి వంశీకృష్ణ, మునగాల గిరిధర్, శీరపు దుర్గాప్రసాద్, కప్పాల లక్ష్మణ్, తెడ్లపు అప్పారావు, బొడ్డు శ్రీనివాస్, సింగానమల నారాయణ, చదుళ్ల రంగనాథ్ తదితీరులున్నారు.