ఏపీ శాసనమండలిలో చీఫ్ విప్ గా శ్రీమతి పంచుమర్తి అనురాధ గారి నియామకం

Download Post





5 months, 2 weeks

ఏపీ శాసనమండలిలో చీఫ్ విప్ గా శ్రీమతి పంచుమర్తి అనురాధ గారి నియామకం

వైసిపి ప్రభుత్వ హయాంలో కేసులకు భయపడకుండా ప్రజల తరఫున ప్రతిపక్షపాత్రను సమర్థవంతంగా పోషించి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారికి పార్టీ గుర్తింపునిచ్చింది. 26 సంవత్సరాల పిన్న వయసులోనే ప్రత్యక్ష ఎన్నికల్లో విజయవాడ మేయర్‌గా ఎన్నికై అత్యంత పిన్నవయస్కురాలైన మేయర్‌గా.. లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. టీడీపీ నుంచే తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన అనురాధ... 23 సంవత్సరాలుగా పార్టీనే అంటిపెట్టుకుని క్రమశిక్షణగల కార్యకర్తగా, సమర్థతగల నాయకురాలిగా, పార్టీకి విధేయురాలిగా పేరు తెచ్చుకున్నారు. మూడు రోజుల కిందట ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో పద్మశాలి కులానికి చెందిన శ్రీమతి పంచుమర్తి అనురాధ గారికి గుర్తింపుని ఇచ్చారు. అంశం ఏదైనా అనర్గళంగా మాట్లాడే పటిమను కలిగివున్న పంచుమర్తి అనురాధను శాసనమండలిలో చీఫ్ విప్పుగా నియమించారు.

పద్మశాలి సంఘాలన్నీ తరపున మరియు పద్మశాలి కుల బంధువుల తరఫున శుభాకాంక్షలు