శ్రీ శ్యామలరావు, IAS గారి బయోడేటా

Download Post





6 months, 2 weeks

గౌరవనీయులు శ్రీ శ్యామలరావు, IAS గారికి తిరుమల తిరుపతి కార్యనిర్వహణాధికారి (TTD Excutive Officer) గా నియామకం పట్ల తిరుపతి పద్మశాలి సంఘం అధ్యక్షులు శ్రీ సేపూరి రామ్ మోహన్, సెక్రటరీ శ్రీ ఇప్పనపల్లి శేషయ్య, కోశాధికారి శ్రీ బోగ హేమాద్రి మరియు ఇతర సభ్యులు వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు.

ఒక గొప్ప మెరిట్ స్టూడెంట్ తను, ఎలా అంటే ఎంసెట్ లో 29 th ర్యాంక్..
తర్వాత కాకినాడ JNTU లో బీటెక్ ,అదవగానే IIT Mumbai నుండి ఎం టెక్...
క్యాంపస్ సెలెక్షన్స్ లో BPCL లో ఉద్యోగం ,కొద్దిరోజుల్లోనే IES కి సెలెక్ట్ అయ్యారు.

చదువే లక్ష్యం గెలవడమే తన ఆశయం అని కష్టపడితే తప్ప ఒక స్టూడెంట్ కి ఇవన్నీ సాధ్యం కాదు.
కొన్నాళ్ళు AIR లో పనిచేసారు తర్వాత సౌత్ సెంట్రల్ రైల్వే కి వచ్చారు.97 లో ఐఏఎస్ కి సెలెక్ట్ అయ్యారు
అదీ ఆల్ ఇండియా  34 th ర్యాంక్ ..

అసోం లో పనిచేసారు తర్వాత ఆంధ్రప్రదేశ్ కి వచ్చారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ కలెక్టర్ గా  పనిచేసి తర్వాత హైద్రాబాద్ మెట్రో వాటర్ బోర్డు MD గా చేసారు.ఆ తర్వాత కమర్షియల్ టాక్స్ కమిషనర్  గా చేసారు
సివిల్స్ లో మేథ్స్ తీసుకున్న ఈయన స్కోర్ 100/100 .
ఇప్పటివరకూ ఈ ట్రాక్ రికార్డు చేరుకున్నవాళ్ళు లేరు..

వైజాగ్ కలెక్టర్ గా చేస్తునప్పుడు జెనిరీక్ మెడిసిన్స్ మీద అవగాహన పెంచి అందుబాటులోకి వచ్చేలా కృషి చేస్తే 3 లక్షల  ఇంజెక్షన్ 70 వేలకి వచ్చింది అప్పుడు.
ఆయన వాటికి "జీవనాధార" అని పేరు పెడితే  తర్వాత రోజుల్లో ఆయుష్ అయ్యింది.

ఇండియా లో బయోమెట్రిక్ రావడం కోసం కష్టపడ్డారు ఎందుకంటే రిమోట్ ఏరియాలో స్కూల్స్ లో అటెండెన్స్ మానిటర్ చెయ్యడం కోసం..

ఇంతటి విజయాలని తన ఖాతాలో గర్వం గా వేసుకున్న వ్యక్తి అతి సామాన్యం గా కనిపించే J.శ్యామలరావు గారు.టీటీడీ ప్రస్తుత ఈవో.

మరి అంతటి కలియుగ వైకుంఠం తిరుమల ఈవో డైనమిక్ వ్యక్తి, శ్యామలరావు గారి వివరాలు తెలుసుకుని
మీ అందరితో అభిమానం గా పంచుకుందాం అనుకున్నా..

నోట్: ఇది పాలిటిక్స్ కి సంబంధం లేదు.
ఒకవ్యక్తి శక్తి గా మారిన విధానం నాకు ఇన్స్పిరేషన్ అనిపించింది.

శ్యామలరావు గారికి ఆయన కుటుంబానికి స్వామి అనుగ్రహం ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా...

.......

 ఆ దేవ దేవుడు ఉన్న తిరుమల నాకు చాలా పెద్ద అండ గా అనిపిస్తుంది.
అందుకే చివరిగా ఒకే మాట తిరుమల గురించి...
.....
"నువ్వు ఎంత గొప్ప భక్తుడు అయినా నీ దగ్గర ఎంత డబ్బున్నా..నువ్వు ఎంత పెద్ద వీఐపీ ,అయినా నీకెంత మందీ మార్బలం ఉన్నా.."తిరుమలకి నువ్వు వెళ్ళాలి అనుకుంటే వెళ్లవు...ఆ స్వామి నిన్ను చూడాలి అనుకుంటే వెళ్తావు అంతే"..