మరపురాని, మరువలేని మహానేత స్వర్గీయ వానపల్లి రవికుమార్ గారి జయంతి 28-11-2024

Download Post





4 months, 4 weeks

మరపురాని, మరువలేని మహానేత స్వర్గీయ వానపల్లి రవికుమార్ గారి జయంతి 28-11-2024

మరపురాని మహానేత విశాఖ తెలుగుదేశం పార్టీ మాజీ కార్పొరేటర్ 2000 పైన  అనాధ శవాలకు దహన సంస్కారాలు నిర్వహించిన మరెందరికో మార్గదర్శకులైన మీ ఆశయ సాధనలో పయనిస్తామని తెలుపుతూ...💐🙏

స్వర్గీయ శ్రీ వానపల్లి రవికుమార్ అన్నగారి 57వ జయంతి మహోత్సవం సందర్భంగా ఆ మహనీయునికి ఘనమైన నివాళులర్పిస్తూ ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన పక్షాన ఈ మన మహనీయుని జయంతి మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేయుచున్నాము💐🙏

      ఇట్లు
APPYS టీం...
రాష్ట్ర ప్రతినిధి
శ్రీ గోపిశెట్టి రామాంజనేయులు ఋషి,ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన...

మరపురాని, మరువలేని మిత్రులు స్వర్గీయ వానపల్లి రవికుమార్ గారు.......
గుత్తికొండ ధనుంజయరావు
**********
మిత్రమా...... నీవు మా నుండి దూరమయ్యే నాలుగు రోజుల ముందు నీవు నాతో ఫోన్లో మాట్లాడిన మాటలు ఇప్పటికీ ధ్వనిస్తూనే ఉన్నాయి...

నీ జననం వేలమంది అన్నార్తుల ఆకలి తీర్చింది.. నీ కరుణ వేలాదిమంది అనాధలై మృతి చెందిన దీనులకు ఆసరా అయ్యింది...
నీ మృతి మాకు ఆశనిపాతమైంది మిత్రమా....
నీవు ఎక్కడున్నా.. విశాఖ నగరిలో ప్రతినిత్యం నీవందించిన, చేయూతనిచ్చిన చేతులు ఇప్పటికీ కళ్ళకు కనిపిస్తూనే ఉంటాయి.. ఇది చరిత్రలో నిలిచిపోయే నీ సేవ తత్పరత ఆనవాళ్లు.....
నీవు అందించిన సేవా స్ఫూర్తి ఎందరికో ఆదర్శప్రాయం.. తప్పనిసరిగా నీ ఆశయాలు..ఆశలు ఏదో ఒక రూపంలో ప్రజలకు సేవ అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని నీ జన్మ దినోత్సవ సందర్భంగా తెలియజేస్తూ...
నీకు ఘన నివాళి అర్పిస్తూ...
మీ..మిత్రులు....
గుత్తికొండ ధనుంజయరావు
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
తెలుగుదేశంపార్టీ బీసీసెల్
మంగళగిరి

 

 

మరపురాని మహానేత విశాఖ తెలుగుదేశం పార్టీ మాజీ కార్పొరేటర్ 2000 పైన  అనాధ శవాలకు దహన సంస్కారాలు నిర్వహించిన మీరు మా మధ్యలో లేకపోయినా మీ గురించి గర్వంగా చెప్పు కొన్ని ఆశయంతో ముందుకు నడుస్తూ  మరెందరికో మార్గదర్శకులైన మీ ఆశయ సాధనలో పయనిస్తామని తెలుపుతూ...💐🙏

స్వర్గీయ శ్రీ వానపల్లి రవికుమార్ అన్నగారి 57వ జయంతి మహోత్సవం సందర్భంగా ఆ మహనీయునికి ఘనమైన నివాళులర్పిస్తూ అనకాపల్లి జిల్లా పక్షాన ఈ మన మహనీయుని జయంతి మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేయుచున్నాము💐🙏

      ఇట్లు
మాడెం సూరి అప్పారావు
అనకాపల్లి జిల్లా, చేనేత విభాగం వింగ్స్ ... ✊🚩