Download Post
1 day, 9 hours
రాబోవు తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు కృషి చేయాలి...పోనగంటి భాస్కర్
తిరుపతి అసెంబ్లీ లోని వెస్ట్ మండల సంస్థాగత సమావేశం మండల అధ్యక్షులు శ్రీధర్ శెట్టి గారి అధ్యక్షతన జరిగినది.
ఈ సందర్భంగా బిజెపి సీనియర్ నాయకులు పోనగంటి భాస్కర్ గారు మాట్లాడుతూ రాబోవు తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లో యన్. డి. ఎ. ఆధ్వర్యంలో బిజెపి అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి కార్యకర్త తన భూత్ పరిదిలో యన్ డి ఎ ప్రభుత్వం చేసే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు గురించి తెలియ చేసి ప్రజలను చైతన్యవంతును చేసి బిజెపి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది.
పార్టీ బలోపేతం గురించి శక్తి కేంద్రం పై చర్చించారు, కేంద్ర ప్రభుత్వం పథకాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని తెలిపారు, SIR కీలక దశ గురించి తెలియజేస్తూ అందరూ బాధ్యతగా పనిచేయాలన్నారు, సంస్థాగత ఎన్నికలపై చర్చించారు, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతి కార్యకర్త వాళ్ళ ఇంటి పై జాతీయ జండా ను ఎగరవేయాలి అని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల పై ద్రుష్టి సాధించి తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లో నుండి పోటీచేయలని మండల కార్తకర్తలకు దిశానిర్దేశం చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు పోనగంటి భాస్కర్ గారు, మండల ఇన్ చార్జ్ మల్ల కుప్పం శేఖర్, వర ప్రసాద్, సుబ్బు యాదవ్, జనార్ధన్ రెడ్డి,నాధముని,హరి, ఆకుల ప్రసాద్,BLA 2 లు,కార్యకర్తలు పాల్గొన్నారు.
_ మీ_
పోనగంటి భాస్కర్
బిజెపి సీనియర్ నాయకులు
తిరుపతి...🚩