ఛలో మంగళగిరి- చేనేత గర్జన

Download Post





1 day, 3 hours

"ఛలో మంగళగిరి- చేనేత గర్జన" 
ఆదివారం ఫిబ్రవరి 22, 2026, 

ఫిబ్రవరి 6, 2026 శుక్రవారం 
నాడు గుంటూరు జిల్లాలో                                          ప్రచార కార్యక్రమ నిర్వహణ. 

1) ఫిరంగిపురం లోని 
 అంబేద్కర్ చేనేత సహకార సంఘ ఆవరణ నందు స్థానిక చేనేత నాయకులతో ఉదయం 
10:00 గంటల నుండి మధ్యాహ్నం 
11.30 వరకు సమావేశం.,

2) సత్తెనపల్లి పట్టణంలోని ఫణిదం చేనేత సహకార సంఘం నందు మధ్యాహ్నం 
12:30 నుండి 02:00 వరకు సమావేశం 
మరియు కరపత్రాల, వాల్ పోస్టర్స్ 
ఆవిష్కరణ.,

3) సత్తెనపల్లి రాత్రి 7:00 
నుండి 8:30 వరకు వేదిక: 
సుందరయ్య చేనేత కాలనీ., 

 రాత్రి 10 గంటలకు మంగళగిరి. 

వీవర్స్ న్యూస్, 06/02/26, 
 గుంటూరు జిల్లా :

ప్రపంచ ప్రసిద్ధి పొంది వేలాది కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని భారతదేశానికి ఆర్జించి పెడుతున్న చేనేతకళను రక్షించుకోవడానికి, 
చేనేతల న్యాయ సమ్మతమైన డిమాండ్లను సాధించుకోవడానికి, హక్కులను రక్షించుకోవడానికి, సమస్త చేనేత ప్రజానీకానికి సంక్షేమ ఫలాల సాధన, సమన్యాయం కోసం ఆదివారం ఫిబ్రవరి 22, 2026,  మంగళగిరిలో నిర్వహించనున్న చేనేత గర్జన కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రచార కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లాలో  పర్యటించి, ప్రచారం నిర్వహించారు. 

 ఈ విస్తృత ప్రచార కార్యక్రమంలో 
భండారు ఆనందప్రసాద్ (కో-కన్వీనర్ APHAJAC, వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు 
AIWF, మాజీ మున్సిపల్ చైర్మన్, పెడన) పిల్లలమర్రి నాగేశ్వరరావు (కో-కన్వీనర్ 
APHAJAC, నేషనల్ కోర్ మెంబర్ AIWF, ప్రధాన కార్యదర్శి AP చేనేత కార్మిక సంఘం), 
పిల్లలమర్రి బాలక్రిష్ణ (కో-కన్వీనర్ APHAJAC, ప్రధానకార్యదర్శి-ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం), కట్టా దుర్గారావు (కో-కన్వీనర్ APHAJAC, అధ్యక్షులు- ఫణిదం చేనేత సహకార సంఘం), రామనాథం పూర్ణచంద్ర రావు (చేనేత కాంగ్రెస్), పసల థామస్ (చేనేత సహకారసంఘ అధ్యక్షులు) మరియు స్థానిక చేనేత సంఘాల ప్రతినిధులు, నాయకులు, చేనేత సామాజికులు పాల్గొన్నారు..

-ఆంధ్రప్రదేశ్ చేనేత సంఘాల ఐక్య 
కార్యాచరణ కమిటీ APHAJAC

CLASSIFIEDS