Download Post
5 months
Cheque Bounce Amendment 2023
చెక్ బౌన్స్ రూల్స్ తెలుసా..?
ఇబ్బందులు పడకూడదంటే తప్పక తెలుసుకోండి.
Cheque Bounce: ఆన్ లైన్ చెల్లింపుల యుగంలో చెక్కుల వినియోగం భారీగా పెరిగింది. పెద్ద మొత్తంలో డబ్బు చెల్లింపులకు బదులుగా చెక్కులను వాడాల్సి రావటం దీనికి కారణం. అయితే తరచూ చెక్ బౌన్స్ వార్తలు కూడా తెరపైకి వస్తుంటాయి. అయితే దీనికి సంబంధించి రూల్స్ తెలుసుకోవటం తప్పనిసరి. జరిమానా-శిక్ష.. మీరు చెల్లింపుల్లో భాగంగా ఇతరులకు ఇచ్చిన చెక్ బౌన్స్ అయితే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాక కొన్నిసార్లు జైలుకు సైతం వెళ్లాల్సిరావచ్చు. అనేక మార్లు ఇదే తప్పులను చేస్తున్నట్లయితే.. బ్యాంక్ మీ చెక్ బుక్ సౌకర్యాన్ని నిలిపివేసే ప్రమాదం ఉంది.
చెక్ బౌన్స్ కారణాలు..
చెక్ బౌన్స్ కావటానికి ఒకటి కంటే ఎక్కువ కారణాలు ఉండవచ్చు. వీటిలో ముఖ్యమైన కారణం మీ ఖాతాలో బ్యాలెన్స్ తక్కువగా ఉండడం. ఇతర బ్యాంకు ఖాతాలు, చెక్కులపై సంతకాలు కూడా ఒక కారణం కావచ్చు. వీటికి తోడు చెక్కుపై పొందుపరిచిన నంబర్ సరిగ్గా లేకపోయినా చెక్కు బౌన్స్ అవుతుంది. అలాగే చెక్ పాడైనట్లయితే సదరు బ్యాంక్ దానిని క్లియర్ చేయదని గుర్తుంచుకోండి.
చెక్ బౌన్స్ అయితే ఏంటి..?
చెక్ బౌన్స్ అయినప్పుడు బ్యాంక్ సదరు ఖాతాదారునిపై జరిమానా విధిస్తుందని మనందరికీ తెలిసిందే. అయితే ఆ పెనాల్టీ మొత్తం బ్యాంక్, బౌన్స్ కు కారణాలపై ఆధారపడి ఉంటుంది. ఖాతాలో తక్కువ బ్యాలెన్స్ కారణంగా చెక్ బౌన్స్ అయితే.. అది క్రిమినల్ కేటగిరీ కిందకు వస్తుంది. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద చర్యలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష కూడా పడే ప్రమాదం ఉంటుంది. దీనికి సంబంధించి కొన్నిసార్లు లీగల్ నోటీసులు కూడా అందుకోవచ్చు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
ఎవరికైనా చెక్కు జారీ చేసేటప్పుడు ఖాతాలో తగిన మొత్తానికి నగదు నిల్వలు ఉన్నాయో లేవో గమనించాలి రెండవ ముఖ్యమైన విషయం ఏమిటంటే బ్యాంకులో పొందుపరిచిన సంతకాన్ని సదరు చెక్కుపై పెట్టారో లేదో సరిచూసుకోవాలి - దీనికి తోడు చెక్కుపై నింపిన వివరాలు సమాచారాన్ని జాగ్రత్తగా నమోదు చేయాలి
*చెక్ బౌన్స్ రూల్స్ తెలుసా..?
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
చెక్ బౌన్స్ కేసు ఇబ్బందులు పడకూడదంటే తప్పక తెలుసుకోండి.