Download Post
4 months, 2 weeks
చిత్తూరు జిల్లా పోలీసు శాఖ
పత్రికా ప్రకటన
చిత్తూరు జిల్లా నుండి *గిరి ప్రదక్షిణ (గిరివలం) కు వెళ్ళే భక్తులకు చిత్తూరు పోలీసు వారి ముఖ్య విజ్ఞప్తి.
తమిళనాడు జిల్లా, తిరువణ్ణామలైలో, ఈ ఏడాది కార్తీక మహా దీప ఉత్సవం 13.12.2024న జరగనుంది. ఈ మహా దీపాన్ని తిలకించడానికి మరియు పవిత్ర పర్వతం చుట్టూ గిరి ప్రదక్షిణ (గిరివలం) చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ప్రతీ ఏటా భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు.
చిత్తూరు నుండి తిరువణ్ణామలైకు భారీ సంఖ్యలో భక్తుల రాకపోకలను సులభతరం చేయడం కోసం, కింది విధంగా స్పష్టమైన భద్రతా ఏర్పాట్లను తిరువన్నామలై పోలీసులు రూపొందించారు.
తాత్కాలిక బస్ స్టాండ్స్
* చిత్తూరు మరియు తిరుపతి నుండి వెల్లూరు రోడ్ మీదుగా తిరువణ్ణామలైకి వెళ్ళే APSRTC బస్సుల కోసం రెండు ప్రత్యేక బస్ స్టాండ్స్ ను “తాయి మూగంబికా నగర్ మరియు AKS నగర్ (దీపం నగర్ జంక్షన్ సమీపం, తిరువణ్ణామలై బైపాస్ రోడ్)” నందు ఏర్పాటు చేయడం జరిగింది.
కారు పార్కింగ్
* చిత్తూరు నుండి వెల్లూరు రోడ్ ద్వారా తిరువణ్ణామలైకి వచ్చే కార్ల కోసం 13 పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేశారు. 12.12.2024 ఉదయం 07:00 గంటల నుండి, కార్లను తిరువణ్ణామలై పట్టణంలోని వెంగిక్కల్ తేంద్రల్ నగర్ వరకు మాత్రమే అనుమతిస్తారు.
* బస్ స్టాండ్స్ మరియు కార్ పార్కింగ్ స్థలాల మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి తిరువణ్ణామలై జిల్లా పోలీస్ హెల్ప్‌లైన్ నంబర్ 9363622330 కు Whatsapp లో "HELLO" అని పంపితే, గూగుల్ మ్యాప్ ద్వారా మార్గదర్శనాలు పొందవచ్చు. తద్వారా భక్తులు తాత్కాలిక బస్ స్టాండ్లు మరియు కారు పార్కింగ్‌లకు సులభంగా చేరుకోగలరు. తాత్కాలిక బస్ స్టాండ్స్ మరియు కార్ పార్కింగ్ స్థలాల నుండి తిరువణ్ణామలై నగరానికి ఉచితంగా ప్రైవేట్ మరియు ప్రభుత్వ బస్సులు అందుబాటులో ఉంటాయి.
భక్తులకు ముఖ్య సూచనలు:
1. రోడ్డు పక్కన ఎలాంటి వాహనాలను నిలుపరాదు. కేటాయించిన పార్కింగ్ ప్రదేశాలలో మాత్రమే పార్కింగ్ చెయ్యాలి.
2. భక్తులు క్యూలైన్ లను అనుసరించి ఆలయ అధికారులకు సహకరించాలి.
3. ఆలయ గోపురాల ముందు లేదా గిరివలం మార్గంలో ఎక్కడా కర్పూర దీపాలను వెలిగించరాదు.
4. భక్తులు తమ మొబైల్ ఫోన్లు, ఆభరణాలు మరియు ఇతర విలువైన వస్తువులను జాగ్రత్తగా సంరక్షించుకోవాలి. అనుమానాస్పద వ్యక్తులు లేదా అనుమానాస్పద వస్తువులను గమనిస్తే వెంటనే సమీపంలోని పోలీస్ అధికారులకు లేదా May i help you బూత్ పోలీసులకు సమాచారం అందించాలి.
5. గిరివలం మార్గంలోని నీటి ప్రాంతాల్లోకి ప్రవేశించరాదు. గోపురాల దగ్గర లేదా గిరివలం మార్గంలో చెప్పులు విడవకుండా కేటాయించిన పాదరక్షల కేంద్రాలలో మాత్రమే జమచేయాలి.
6. గిరివలం మార్గంలో గ్యాస్ సిలిండర్లతో వంట చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. అడవి ప్రాంతాల్లోకి సంబందిత అధికారుల అనుమతి లేకుండా ప్రవేశించడం లేదా కొండ ఎక్కడం నిషిద్దం.
7. భక్తులకు ఏవైనా ఆరోగ్య పరమైన సమస్యలు ఎదురైనపుడు తిరువన్నామలై పోలీసు వారు ఏర్పాటు చేసిన వైద్య శిబిరాల సహాయం పొందవచ్చు.
అత్యవసర పరిస్థితుల సమయంలో సంప్రదించవలసిన నంబర్లు:
• తిరువణ్ణామలై టౌన్ క్రైం పోలీస్ స్టేషన్: 04175-222303
• పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయం: 9498100431
• అత్యవసర సహాయం: 100
• జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్: 9159616263