Download Post
3 months, 1 week
ఇటీవల విడుదలయిన గేమ్ చేంజర్ భారత నాగరీకులు చూడవలసిన చిత్రం. ఇందులో యువత తెలుసుకోవలసిన అనేక అంశాలు ఉన్నాయి. యంత్ర విద్యలు (ఇంజనీరింగ్) నేర్చుకునే వారు ఇప్పటి రాజకీయ అంశాలు, రాజ్యాంగ వ్యవస్థలు ఎలా పని చేస్తాయో ఇసుమంతైనా తెలియదు. వారి లోకంలో వారు బతుకు ఈడుస్తుంటారు. మనకెందుకులే అనే విపరీతం వారిలో నెలకొని ఉంది. వీళ్ళు ఓటు వేస్తేనే గొప్ప అనుకుంటారు. అంతటితో వారి బాధ్యత అని వారి భావన. అందుకే దేశం వెనకబడి ఉంది. ఇవన్నీ పటాపంచలు చేస్తూ వచ్చిందే గేమ్ చేంజర్.
ఈ చిత్రంలో చర్చించిన విషయాలు:
1. రేషన్ బియ్యం పాలిష్ చేస్తే, వాడే రసాయానాల వల్ల ఆ బియ్యాన్ని ఎలుకలే తినవు మరి మనుష్యులు ఏట్లా తింటారు.
2. షాపింగ్ మాల్ లోకి కనీసం ఫైర్ ఇంజన్ వెళ్ళని పరిస్థితుల్లో దాన్ని కూల్చటం.
3. ఇసుక మాఫియా
4. ఇనుప ఖనిజ కంపెనీల దోపిడి.
5. వ్యవసాయం యొక్క గొప్పదనం.
6. పురుష లెక్చలర్లు రీసెర్చ్ విధ్యార్థినులను లైంగిక వేధింపులకు గురి చేయటం.
7. ఇన్ డోర్ లో గంజాయి పెంచే యువత పీచ మణచటం.
8. పాల ఫ్యాక్టరీలలో పాలల్లో యూరియ కలపటం వల్ల మెదడు సంబంధిత రోగాలు వస్తాయని చెప్పటం.
9. పరిష్కారం కాకున్నా అదే పనిగా ప్రభుత్వానికి అర్జీలు పంపే వయోజనుల అంశం.
10. ముఖ్యమంత్రి చనిపోతో వారి పుత్రుడు అధికారం కోసం వెంపర్లాడటం.
11. ప్రభుత్వం వద్ద ఉండే ఐ.ఏ.ఎస్.లు బానిసలు కాదని వారికి ఎన్నో అధికారాలు ఉంటాయని చూపటం.
12. నిజానికి ఐ.ఏ.ఎస్. ల వల్లనే రాజకీయ నాయకులు పాలించ గలుగుతున్నారనే విషయం.
13. ఎన్నికల వేళ ఎన్నికల అధికారులకు ఉండే విశేష అధికారాలు.
14.డబ్బుతో ఓటర్లను కొని మరింత డబ్బు దండుకునే రాజకీయ నాయకుల మనస్తత్వం.
15. డబ్బు లేని రాజకీయ వ్యవస్థ తేవటం వల్ల అలాంటి పనులు చేస్తే తన అనుచరులే చంపేయటం.
16. వాక్చాతుర్యం లేకపోతే తన తోటి వారి అణచేస్తారనే విషయం.
17. ముఖ్యమంత్రి కాగానే పారిశ్రామికవేత్తలు డబ్బు పెట్టెల పంపిణీ వంటివి.
18. ఎలక్త్రానిక్ ఓటింగ్ ఉన్నా రిగ్గింగ్ పాల్పడే అంశం.
19. ఓటింగ్ యంత్రాలు ధ్వంసం చేయటం.
20. కౌంటింగ్ కేంద్రాలపై దాడులు.
21. ఇంకా ఎన్నో సమస్యలకు హీరో పరిష్కారలు చేసి చూపెడతారు.
ఇది యువతరం చూడాల్సిన చిత్రం.