Download Post
1 day, 9 hours
తిరుపతి లో ఘనంగా
హర్ ఘర్ తిరంగా అభియాన్ యాత్ర... 🇮🇳🇮🇳🇮🇳
దేశభక్తి, జాతీయ సమైక్యత, దేశంపై ప్రతి ఒక్కరిలో గౌరవభావాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా అభియాన్ – తిరంగా యాత్ర తిరుపతి నగరంలో ఉత్సాహభరితంగా జరిగింది.
తిరుపతిలోని కపిలతీర్థం నుంచి అన్నారావు సర్కిల్ వరకు వెస్ట్ మండలం, నార్త్ మండలం ఆధ్వర్యంలో ఈ తిరంగా యాత్రను నిర్వహించారు. జాతీయ జెండాలను చేతబూని బీజేపీ సీనియర్ నాయకులు పోనగంటి భాస్కర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని యాత్రను విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా పోనగంటి భాస్కర్ గారు మాట్లాడుతూ పంచాయతీ నుండి పార్లమెంట్ వరకు ప్రతి ఓక్కరు జాతీయ జండా ను ఎగరవేయాలి అని కోరారు.
భారత జాతీయ జెండా కేవలం ఒక వస్త్రపు ముక్క కాదని, అది దేశ స్వాతంత్ర్య పోరాటం, త్యాగాలు, సమైక్యత, సార్వభౌమత్వానికి ప్రతీక అని అన్నారు.
మూడు రంగుల్లో దేశం యొక్క గొప్ప చరిత్ర, త్యాగం, శాంతి, సత్యం, అభివృద్ధి, ధర్మచక్రం వంటి విలువలు ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు.మన త్రివర్ణ పతాకం ప్రతి భారతీయుడి గుండెల్లో గర్వాన్ని నింపే జాతీయ ప్రతీక అని, జెండాను గౌరవించడం అంటే దేశాన్ని, దేశం కోసం త్యాగం చేసిన మహనీయులను గౌరవించడమేనని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జల్లి మధుసూదన్, పోనగంటి భాస్కర్, తెల్లాకులా శ్రీధర్ శెట్టి, పగడాల ప్రభాకర్ నాయుడు,అజయ్ కుమార్, వర ప్రసాద్, గాలి పుష్ప, రాటకోండ విశ్వనాథ్, మల్ల కుప్పం శేఖర్,భవానీ శంకర్, సుబ్బు యాదవ్, జనార్ధన్ రెడ్డి, గుండాల గోపీనాథ్ రెడ్డి, కీర్తి వెంకయ్య గారు, డాక్టర్ ప్రదర్శిని, ఏయస్ ప్రసాద్,పుష్ప రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
జై హింద్...🇮🇳