మనం చేసే దానం ఎలా ఉండాలీ...?

Download Post





6 months, 1 week

మనం చేసే దానం ఎలా ఉండాలీ...?

“దానం అనేది ఒక బాధ్యత! మంచి సమయంలో, మంచి ప్రదేశంలో, మంచి ఉద్దేశంతో, సరైన వాడికి  తిరిగి ప్రతిఫలం ఆశించకుండా చేసిన దానాన్ని ‘సాత్విక దానం’ అంటారు!

ప్రతిఫలం ఆశించి, మళ్ళి తిరిగి రావాలనే భావంతో, బలవంతంతో, డంబము, పేరుకోసం మోహమాటంగా ఇష్టం లేకున్నా చేసే దానాన్ని ‘రాజసిక దానం’ అంటారు!

సందర్భమే లేకున్నా, అనువుకాని చోట, యోగ్యత లేని వారికి, అగౌరవంగా, అవమానకరంగా ఇచ్చే దానాన్ని ‘తామసిక దానం’ అంటారు.

ఈ కాలంలో చాలా మంది చేసేవి రాజసిక దానాలే! ఒకరికి సహాయం చేస్తే ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని తిరిగి మనకేమైనా రావాలి అనే భావంతో చేసేవే!

ఫలాపేక్ష లేకుండా దానం చేసే వాళ్ళు ఈ కాలంలో అరుదు!

ఇచ్చే దానం నేను ఇస్తున్నా అనే తలపు నుండి ఏది నాది..?  ఏది ఎవరిది..? అనే ప్రశ్నల నుండి అంతా పరమాత్మునివే..

నేను, నాప్రాణం, నా ఆస్తి, నా కుటుంబం, నాది ఇలా అన్ని ఆ పరమాత్మునిలోవే, దేనికీ మనం యజమానులం కాదు అనే భావన పూర్తిగా వచ్చాక చేసే దానం చాలా గొప్పది!

అప్పుడు జీవితంలో కూడికలు ఉండవు! తీసివేతలు ఉండవు! అప్పుడు చేసే ప్రతీ పనిలో ఆనందంగా ఉంటారు..

లోకంలో మనుష్యులు నాలుగు రకాలు ఉంటారని శాస్త్రం చెప్పిందని పెద్దలమాట.

అవి స్వార్ధ, పరార్ధ, పరమార్ధ, వ్యర్ధ జీవులని!

స్వార్ధ :-

తనూ , భార్యాపిల్లలు, కోసమే నాలుగురాళ్ళసంపాదనే ధ్యేయంగా జీవిస్తుండేవారు స్వార్ధ జీవులు.

పరార్ధ :-

తమకోసం కాకుండా కేవలం పరహితమే ధ్యేయంగా జీవిస్తుంటారు.

ఉదా :-
వృక్షములు , నదీనదములు, గోవులు వగైరా.

 పరమార్ధ :-

కనిపించే ప్రతీ వస్తువూ అశాశ్వతమనే పరమార్ధ భావనతో జీవిస్తూ మానవాళిని ఉద్ధరించడమే ధ్యేయంగా జీవిస్తుంటారు.

ఉదా:-
ఆదిశంకరులు, మహర్షి రమణులు, రామకృష్ణ పరమహంస వంటివారు.

వ్యర్ధ :-

*_అసలు తామెందుకు పుట్టామో, ఏమి చేస్తున్నామో, ఏంచేయాలో కనీసం తెలుసుకోవాలనే ప్రయత్నం  కూడా చేయకుండా జీవిస్తుండేవారు వ్యర్ధజీవులు