వివాహ బంధం కోసం వెతుకుతున్నప్పుడు- నిపుణుల సూచనలు - పొలిచెర్ల వెంకటేశ్వర్లు

Download Post





4 months, 3 weeks

1) "విజయవంతమైన కెరీర్"---" విజయవంతమైన జీవితం"-- ఏది ముఖ్యం  2) బయోడేటాను తయారుచేయడంలో 'మీరు' చేసే తప్పులు 3) వివాహ నిశ్చితార్థానికి/ ఖాయపరచుకోవడానికి" ----------"వివాహ లగ్నానికి "మధ్య వ్యవధి ఎక్కువగా ఉండవచ్చా 4)  నామందార్లు(తిరుమందార్లు) ---- మోటుగాళ్లు------------------ శాస్త్రీయత--- వాస్తవికత ----వీటిపై ఒక విశ్లేషణ 5) "పెళ్లి ఫోటోలే ..వివాహానికి నిర్ణయాత్మకాలా !..

 

🌷  "విజయవంతమైన కెరీర్"---" విజయవంతమైన జీవితం"-- ఏది ముఖ్యం ---ఒక విశ్లేషణ --ప్రతి అమ్మాయి ,అబ్బాయి బాగా చదువుకొని మంచి ఉద్యోగం లేదా మంచి ఎంటర్ప్రైన్ యువర్ అయ్యి స్థిరపడవలనని భావించడం సహజమే. ఈ విధంగా చదువు అయిపోయిన తర్వాత స్థిరపడడానికి ప్రయత్నించడం కూడా సహజమే .అయితే చదువు తర్వాత  మరియు స్థిరపడడానికి మధ్య కాలం, "చాలా ప్రాముఖ్యతతో "కూడుకున్నది. చాలామంది పిల్లలు కెరీర్ కి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం కూడా మంచిదే, అయితే ఈ మధ్యలో వివాహ వయసు కూడా ముఖ్యమని భావించాలి............... ఉదాహరణకు ఒక అబ్బాయి బీటెక్ ,ఎంటెక్ చదవడానికి 21 లేదా 23 సంవత్సరంల అవుతుంది. అప్పుడు వారికి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి తక్కువ జీతంతో ఉద్యోగంలో చేరాలి అయితే ఈ జీతం సిటీలో "ఫ్యామిలీ"కి సరిపోదు ,అందుకు ఎక్స్పీరియన్స్ ,ప్రమోషన్ కు ఎదురు చూడటం సహజమే .ఆరంకెల జీతంను పొందేటప్పటికీ వయసు 30 కి చేరుతున్నది అప్పుడు వివాహ ప్రయత్నాలు మొదలుపెడితే వెంటనే కుదరవు కదా దీనికి ఒకటి లేదా రెండు సంవత్సరములు కొందరికి మూడు నాలుగు సంవత్సరంలో కూడా అవుతున్నది .ఇక్కడ అమూల్యమైన వివాహ వయస్సు కోల్పోవడం జరుగుతున్నది. ఈ విధంగా కెరీర్ కి ప్రాముఖ్యత ఇచ్చిన వారికి 60 సంవత్సరములు వచ్చేటప్పటికి కూడా తమ పిల్లలు  "చేతి క్రిందికి " రారు అనే విషయాన్ని గమనించుకునేది ... ....................ఇక్కడ ఇంకొక విషయాన్ని పరిశీలిస్తాం. టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన అతనికి వేరే దారి లేక మగ్గం లేదా ఇతర వ్యాపారం ''select" చేసుకున్నాడు అనుకుంటాము అతనికి 19 సంవత్సరములు వయసు వచ్చేటప్పటికి నాలుగు సంవత్సరముల ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. కాబట్టి అతనికి 20 లే దా 21 సంవత్సరంలో పెళ్లి అయ్యి 40  లేదా 45 సంవత్సరములు వచ్చేటప్పటికి వారి పిల్లలు "చేతి క్రిందికి "వచ్చి బాగా స్థిరపడిన ఫ్యామిలీలని  50 సంవత్సరములు పైబడిన వారందరూ గమనించి ఉంటారు .ఇక్కడ త్వరగా పెళ్లి చేసుకున్న వారు తమ మనవళ్లను /మనమరాండ్రిని,,ముని మనవళ్లను/ముని మనవరాండ్రులను కూడా చూస్తున్నారు .మొదటిది విజయవంతమైన కెరీర్ అయితే ,రెండవది విజయవంతమైన జీవితం. రెండవ రకంలో 45 సంవత్సరములకి పిల్లల సంపాదన కూడా తోడు అవుతున్నది .మొదటి రకంలో 55/ 60 సంవత్సరములు గాని పిల్లల ఆదాయం తోడవదు......... పై రెండింటినీ బేరేజు వేస్తే విజయవంతమైన కెరియర్ కన్నా విజయవంతమైన జీవితమే ముఖ్యమైందని భావించవచ్చు .ఈమధ్య ఒక అమ్మాయికి చదువుతుండగానే పెళ్లయినది ,విషయమేమిటంటే ఆ అమ్మాయి తల్లికి వయసు 34 సంవత్సరములు ,ఆ అమ్మాయి తల్లి 75 సంవత్సరంలో వచ్చేటప్పటికి మునిమనమళ్లు పెళ్లిళ్లు చూసినా ఆశ్చర్యం లేదు ఇది. " నిజమైన విజయవంతమైన జీవితం అంటే "కాబట్టి ఫ్యామిలీ సపోర్టు ఉండే వాళ్లు అయినా పిల్లలకి నచ్చజెప్పి ,అండగా ఉంటామని చెప్పితే ,వారికి  "విజయవంతమైన కెరీర్" తో పాటు "విజయవంతమైన జీవితాన్ని" కూడా ప్రసాదించిన వారవుతారు,....... ఇది ఒక విశ్లేషణ మాత్రమే..... ఇట్లు పోలిచర్ల. వెంకటేశ్వర్లు. 🌷

 

🌷 "బయోడేటాను తయారుచేయడంలో 'మీరు' చేసే తప్పులు".------ఒక వివరణ-------ముందుగా మిమ్మల్ని మీరు పరిచయం చేసుకునేటట్లు చేసేదే 'బయోడేటా'. ఇంత ప్రాముఖ్యత కలిగిన బయోడేటాను జాగ్రత్తగా అన్ని విషయాలతో తయారు చేసుకోవాలి కదా, అప్పుడే కదాఎదుటివారికి మీ మీద సదాభిప్రాయం, ఒక అంచనా , ఒక అవగాహన ఏర్పడేది, లేదంటే బయోడేటా కూడా సక్రమంగా తయారు చేసుకోలేని వారి సంబంధం 'ఎట్లా ఉంటుందోలే' అనే  మీమాంశ ఏర్పడుతుంది కదా. మేము ఎన్నోసార్లు ఈ విషయంపై హెచ్చరించినను   చాలామంది ఇంకా పూర్తి సమాచారాన్ని పొందుపరచడం లేదు. అందుకే ఈ వివరణ ద్వారా మీరు చేసే తప్పులను సరిదిద్దుదాం.........(1) ఎక్కువమంది ఇంటి పేరును షార్ట్ ఫామ్ లో రాస్తున్నారు ఇది కరెక్ట్ కాదు. వాయవరులను తెలుసుకోవాలంటే ఇంటి పేరు ఉంటే కదా తెలుసుకునేది. ఒకవేళ వాయ వరసలు ఇంకా ఎక్కడ ఉన్నాయి అనుకుంటే, తల్లిదండ్రుల సడ్డగుల ఇంటి పేర్లతో అయినా పోల్చుకోవడానికి అవసరమే కదా. ఈమధ్య ఒక కాబోయే వరుడుకి నేను ఫోన్ చేసి ఎందుకు షార్ట్ ఫామ్  M అని పెట్టావు అంటే ,M అంటే మాడ అనే కదా అన్నాడు. మామిళ్ళ, మేరువ, మద్దూర, మునగపాటి, మాస,  మలవతు ఇంకా చాలా ఇంటిపేర్లు M తో స్టార్ట్ అవుతాయి కదా అంటే అవునా సార్ అని ఆ తర్వాత క్లియర్ గా మెన్షన్ చేశాడు...........(2) Address:-  ఎక్కువమంది అడ్రస్ ను పేర్కొనడం లేదు. ఇది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే శ్రీకాకుళం వాళ్ళు  చిత్తూరు, కడప వాళ్లను దూరం ఎక్కువ కాబట్టి సాంప్రదాయాలలో తేడా ఉంటాయనే ఉద్దేశంతో చేసుకోవడానికి ఎక్కువమంది ముందుకు రాకపోవచ్చు. అడ్రస్ పేర్కొనడం వల్ల అనవసరంగా వచ్చే కాల్సరద్దీ తగ్గుతుంది కదా. ఒకరిని ఎందుకు అడ్రస్ పెట్టలేదు అని అడిగితే కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాము కదా అన్నారు. అది కూడా కరెక్టే అనుకుంటే ఫోన్ చేసిన తర్వాతే కదా ఏ ప్రాంతమో తెలిసేది. ఇది అనవసర ప్రయాసే కదా.(3) sibling:----మరి కొంతమంది సిబ్లింగ్ లో 1 అని, 2 అని పెడుతున్నారు. బ్రదరా, సిస్టరా ,తెలుపకపోవడం వల్ల బామ్మర్దులు ఉండేది, లేనిది ఎట్లా తెలుస్తుంది..... .(4) తల్లిదండ్రుల వృత్తులు............ ఈ వివరాలు పొందుపరిస్తే ఇన్ డైరెక్ట్ గా కుటుంబ ఆర్థిక పరిస్థితి అర్థం అవుతుంది.(5)PDF లు:-------మరికొంతమంది పిడిఎఫ్ లలో బయోడేటాలు పంపుతున్నారు, ఇంకొందరైతే బయోడేటా తో పాటు ఫోటోలు కూడా పిడిఎఫ్ లో పంపుతున్నారు, ఇవి చాలామందికి సరైన యాప్ లేక ఓపెన్ కాక పోవడం వల్ల అవకాశాలను కోల్పోతున్నారు. ఓపెన్ కావడం లేదని మాకు ఫోన్లు చేస్తున్నారు..... ఇక్కడే ఒక విషయాన్ని గ్రహించాలి. రోజు 20, 30 ప్రొఫైల్సు వచ్చి గూడ్స్ బండి కన్నా ఎక్కువ పొడవు అవుతున్నాయి. నాలుగు ,ఐదు ,రోజులకి చూడాలంటే కష్టం అవుతుంది. అవే ఫోటోలను, బయోడేటాలను పిడిఎఫ్ లో లేకుంటే సులభంగా వెలికి తీయడానికి వీలవుతుంది కదా ..........................(6) contact number:--------ఒకే నంబర్ కు బదులుగా రెండు, మూడు నంబర్స్ఇస్తే కాల్స్ రద్దీని తట్టుకోవడానికి వీలవుతుంది కదా ,మరికొందరైతే కాంటాక్ట్ నెంబరే ఇవ్వరు .మేము అడిగితే మర్చిపోయినాం సార్ అని మరలా ఇస్తున్నారు. ఈ వేదికలుమీకు, మీరే మాట్లాడుకునే వేదికలు కదా.. ... ............................ ఇవే కాకుండా డాక్టర్లు అయితే డాక్టర్లే కాల్ చేయమని, మాకు ఈ జిల్లాల వారే కావాలని, మాకు అబ్రాడ్ వాళ్లే కావాలని, మాకు ఉద్యోగం చేసే వారే కావాలని, మాకు ఉద్యోగం లేకపోయినా పర్వాలేదనీ, మొదలైన ప్రాధాన్యాలను కుటుంబ సభ్యులందరూ చర్చించుకుని బయోడేటాను తయారు చేసి పంపితే ఆ ప్రొఫైల్ ఉత్తమైనదిగా ఉంటుంది కదా. కొంతమంది అన్ని వివరాలతో ప్రొఫైల్స్ పంపడం చూస్తున్నాం కదా వారి నుంచైనా స్ఫూర్తి పొందాలి కదా. ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరంలోఇంగ్లీష్ సబ్జెక్టులో curriculum vitae/resume/ biodata అమ్మాయిలు, అబ్బాయిలు నేర్చుకున్నారు కదా.............. Anyhow marriages are made in heaven🌷.

 

🌷🌷🌷 "వివాహ నిశ్చితార్థానికి/ ఖాయపరచుకోవడానికి" ----------"వివాహ లగ్నానికి "మధ్య వ్యవధి ఎక్కువగా ఉండవచ్చా ! ఈమధ్య కాలంలో  "కాబోయే వధూవరుల' మొబైల్ 'ఛాటింగ్స్ ' 'శ్రేయస్కరమా !   ......................ఒక విశ్లేషణ. .....................పూర్వం ఉమ్మడి కుటుంబాలలో వివాహ క్రతువును అందరూ కలిసి ఒక నెలలో లగ్న పత్రిక రాసుకోవడం, వివాహం జరిపించడం, సారె ,వగైరా అన్ని పూర్తి చేసేవారు............ ఆధునిక కాలంలో " గ్లోబలైజేషన్" పుణ్యమా అని "న్యూక్లియస్ ఫ్యామిలీలు" వచ్చి ,దూరాలు పెరిగి, ఆప్యాయతలు కరమవుతున్నాయి . ఇలాంటి పరిస్థితులలో వివాహ కార్యక్రమం జరపడం ,డబ్బుంటే "ఈవెంట్ మేనేజ్మెంట్ "వల్ల  సులభం అయినాయి .అంతవరకు బాగానే ఉంది...................కాని ఇక్కడనే.. ఇంటిలో ఉండే నాలుగురు లేదా ఐదు మంది సభ్యులలో అందరూ హాజరు అవ్వవలంటే "బిజీ లైఫ్ "లో కుటుంబ కార్యక్రమంలో కూడా కుదరడం లేదు. ఎక్కడో దూర ,సుదూర, ప్రాంతాలలో ఉండడం చేత నిశ్చితార్థానికి పెళ్లికి ఎక్కువ "గ్యాప్ "అవసరమవుతున్నది. ఇది తప్పేటట్లు లేదు .అయితే ఈ "గ్యాపే" పెళ్లి వరకు తీసుకురాకుండా పోయే ప్రమాదం కూడా ఉంది. ఇది అన్ని సందర్భాలలో అని చెప్పలేం ....................అయితే ఇక్కడనే ఖాయం /నిశ్చితార్థం చేసుకున్న తర్వాత modernization లో భాగంగా కాబోయే వారు మొబైల్ నెంబర్స్ఇచ్చుకుని అనవసర , అసందర్భ chats మరియు కాల్స్ చేసుకుని   విషయం అయిపోయిన తర్వాత. "  అనవసర loose talks మాట్లాడుకుని కుదుర్చుకున్న వివాహం ప్రమాదంలో పడటం ఈ మధ్య ఎక్కువైన విషయాన్ని ప్రస్తావించకపోవడం సరికాదు కదా ! ఇక్కడనే ఒక విషయం" కాబోయే వారు "chats ,కాల్స్ చేసుకోవద్దు అని చెప్పడం కాదు ,   "లూస్ టాక్స్" చేసుకోరాదు.కాబట్టి తల్లిదండ్రులు ఈ విషయంపై హెచ్చరించవలెను............... ఒక్క మాటలో చెప్పవలెను అంటే ఆ "ఊసు"లన్నీ దాచి పెట్టుకోండి,వివాహం తర్వాత "భలేగా "ఉంటాయి .ఈ విషయంలో జాగ్రత్త అవసరం................ 'లూజ్ టాక్స్' వల్ల    "ఇప్పుడే ఇలా ఉన్నారు "----"పెళ్లి అయితే ఇంకా ఎట్లా ఉంటారో"  అనే భావన ఏర్పడి పెళ్లి పీటల వరకు రాని సంఘటనలు చూస్తున్నాం. ఈ విషయంలో అప్రమత్తత అవసరం. సాధ్యమైనంతవరకు ఈవ్యవధిని  తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. అయితే అన్ని సందర్భాలలో ఇలా జరుగుతుందని కాదు ,కానీ ఇలాంటి సంఘటనలు మన కళ్లెదురుగానే కనిపిస్తున్నాయి. ఏది మంచో ,ఏది చెడో పిల్లలు ,పెద్దలు అవగాహనతో ఉండవలెను ...............ఏది ఏమైనా వివాహం అనేది వధూవరుల జీవితాలలోకి    "ఒకరికొకరు ప్రవేశించే మధుర క్షణాలు "ఇది ,    "దేవుడు రాసిన రాత". కుటుంబంలో జరిగే అత్యున్నతమైన "సంబరం "ఆ మధుర క్షణాలను ఆస్వాదించండి. సాధ్యమైనంత వరకు వివాహాన్ని ముందుకు తీసుకురండి. వాయిదాలకు విలువ ఇవ్వకండి ................సామాజికంగా పరిశీలించి, విశ్లేషించి , అప్రమత్తంగా ఉండమని రాసిన వ్యాసం.......... ఇట్లు పోలిచర్ల. వెంకటేశ్వర్లు , పుల్లంపేట🌷🌷🌷

 

🌷🌷🌷నామందార్లు(తిరుమందార్లు) ---- మోటుగాళ్లు------------------ శాస్త్రీయత--- వాస్తవికత ----వీటిపై ఒక విశ్లేషణ............. యుక్తవయస్సులో అందమైన అమ్మాయిలు ,అబ్బాయిలు,  కనపడినప్పుడు చాలా బాగున్నారు కదా! అనే భావన అమ్మాయిలకు,అబ్బాయిలకు  కలగడం ప్రకృతి సహజం .ఇలాంటివారు   "అయితే"   బాగుంటుంది కదా అనే భావన కూడా కలగవచ్చు..................... మనకు సమాజంలో కనపడడానికి వాస్తవానికి చాలా తేడా ఉంటుంది. ప్రపంచంలో 800 కోట్ల మందిలో ఆ కనబడిన వారు ఒక్కరు .మన భారత దేశంలోకి తీసుకుంటే 145 కోట్లు .మన తెలంగాణ+ ఆంధ్రలో 10 కోట్లు .................ఇప్పుడు మనకు కాబోయే భాగస్వామిని ఎంపిక కు ఎంతమంది ఉంటారో వాస్తవంగా విశ్లేషిస్తాము........... 10 కోట్లలో మన పద్మశాలీల జనాభా సుమారు 28 లక్షలు- వీరిలో వాయవరసల గా లెక్కిస్తే సగం అవుతుంది కదా అంటే14 లక్షలు . ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి జిల్లాలు 23 ప్రాతిపదికన లెక్క కడితే ఒక్కొక్క జిల్లాలో సుమారు 50వేల మందిఉంటారు. మనం సాంప్రదాయాలతో  చూసుకుంటే రెండు మూడు జిల్లాలలో మాత్రమే సరిపోతా రు. అంటే ఓ లక్ష మంది. ఈ లక్ష మందిలో కుటుంబానికి నలుగురు ఉన్నారంటే 25 వేల కుటుంబాలు ఉన్నట్లు లెక్క. ఈ 25 వేల కుటుంబాలలో అబ్బాయిలుగా, అమ్మాయిలుగా సగభాగం చేస్తే 12500 కుటుంబాలు. వీరిలో పెళ్లికి సిద్ధమైన వారు సుమారు 3000 మంది ఉంటారు. ఈ మూడు వేల మందిలో ఆస్తులు, అంతస్తులు, అందం ఉద్యోగాలు, వ్యాపారాలు ,ఇతర వృత్తులు , మొదలగు వాటి పరంగా విభజిస్తే వేళ్ళ మీద లెక్కబెట్టే సంభావ్యత(probability) వస్తుంది. ఇందులో నుంచి భాగస్వామిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.   ..................... ఇందులో మరలా నామందార్లు-మోటో కాళ్ళు అని విభజిస్తే మనకు వివాహాలు ఎట్లా కుదురుతాయి. ఈ ఆచారము కొన్ని ప్రాంతాలకే పరిమితము. ఇతర ప్రాంతాలలో చాలామంది పెద్దవారికి  కూడా ఈ ఆచారం తెలియదు. అంటే ఆ ప్రాంతం వాళ్లు ఇప్పటికే చేసుకొని కుటుంబ వ్యవస్థను కలిగి ఉన్నారు కదా................... ఇక ఈ మధ్య జాతకాల పిచ్చి ఒకటి ఎక్కువై మంచి సంబంధాలను పోగొట్టుకుంటున్నారు. ఏం మన తండ్రులు ,తాతలు ,ముత్తాతలు జాతకాలు చూసుకుని చేసుకున్నారా, వాళ్లు కుటుంబాలు బాగా లేవా. జాతకాలు చూసి చేసిన పెళ్లిళ్లు ఎన్నో మన కళ్ళ ముందరే విచ్చన్నం కాలేదా...... వివాహమంటే అడ్జస్ట్మెంట్.. ఒక సర్వేలో 89% మంది అడ్జస్ట్మెంట్ తోనే కుటుంబాన్ని నిలబెట్టుకుంటున్నాం అని చెప్పారు. అందుకే marriages are made in heaven అన్నారు. ....... నాకు శాస్త్రీయత తెలిదు కానీ, మిత్రులతో ఆలోచించి వాస్తవంగా ఈ విశ్లేషణ చేశాను   .............ఇట్లు.... పోలిచర్ల. వెంకటేశ్వర్లు.🌷🌷🌷

 

🌷🌷🌷"పెళ్లి ఫోటోలే ..వివాహానికి నిర్ణయాత్మకాలా !............. ఒక అవగాహన..... మనం ఈ పద్మశాలి వధూవరుల వేదికలలో బయోడేటాలతో పాటు ఫోటోలు కూడా  పెడుతున్నాం. ఫోటోలు చూసిన వెంటనే అమ్మాయి లేదా అబ్బాయి  బాగుందనో, బాగాలేదనో నిర్ణయించుకుంటాం. ఇది కరెక్టేనా..... ఈమధ్య ఒకరు పెళ్లి చూపులకు వెళితే ఫోటోలో కన్నా రియల్ గా  "తక్కువ బాగుంది". అని క్యాన్సల్ చేసుకున్నారు. మరొకరు అబ్బాయి పర్వాలేదు అనుకుంటే రియల్ గా బాగుండాడని ఖాయం చేసుకున్నారు . అంటే ఆ అబ్బాయి ఫోటో జెనిక్ ఫేస్ కాదన్నమాట మరియు సాంకేతిక పరిజ్ఞానమైన "ఫోటోషాప్ "ను ఉపయోగించలే దన్న మాట. దీనిని బట్టి సాంకేతిక పరిజ్ఞానంతో ఫోటోలను కొంచెం అందంగా మార్పు చేసుకోవడానికి వీలు ఉందనే విషయాన్ని గమనించుకొనేది. కాబట్టి ఫోటోల మీదనే 100% ఆధారపడి క్యాన్సల్ చేసుకోకుండా , వ్యయప్రయాసాలైనా పెళ్లి చూపుల వరకు వెళ్ళండి. ఫోటోలలో కొంచెం అటు ఇటుగా ఉన్నా చూపులకు వెళితే వారి సాంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు, వంట సుచీ -రుచి, ఇంటి పరిశుభ్రత, పలకరింపు, బంధుత్వాలు, కలుపుగోలుతనం, వడ్డింపు విధానం, మొదలగు విషయాలు అవగౌతమవుతాయి......... నాకు అందం, ఐశ్వర్యం ,చదువు ,ఉద్యోగం ,అన్ని కావాలంటే కుదిరే పని కాదు ,.. అది "దేవుడు రాసి పెట్టి ఉంటేనే". ఒకటి కావాలంటే ,మరొకటి కోల్పోవలసి ఉంటుంది అనే ప్రాతిపదికన వెళితే సులభంగా మంచి సంబంధాలే కుదురుతాయి. "మడి కట్టుకొని" కూర్చుంటే వృధా కాలయాపన అవుతుంది , తద్వారా కుటుంబం గందరగోళానికి వెళుతుంది అప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకోవలసిన పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి రాణించుకోకూడదు. ఈ విషయాలన్నీ 50 సంవత్సరాలు పైబడిన వారికి తెలిసిందే కదా..... కాబట్టి ఫోటోలే నిర్ణయాత్మకాలు కాదు ,.... దారిని చూపించడానికి మాత్రమే ఉపయోగపడతాయని భావించేది . అందరికి శోభన్ బాబులు, నాగార్జునలు ,మహేష్ బాబులు, శ్రీదేవిలు, శ్రీలీలలు ,తమన్నాల వంటివారే కావాలంటే కుదిరే పనేనా. ఈమధ్య ఒక పెద్దాయన ఈ విషయంపై చర్చించితే ఈ మెసేజ్ ని తయారు చేశాను..............NOTE:-అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వివాహం నిశ్చయం కాకముందే తమ మిత్రులతో ఫోటోలను పంచుకోకండి....🌷🌷🌷