Download Post
5 months, 3 weeks
తిరుపతి పద్మశాలి సంక్షేమ సంఘము ఆధ్వర్యంలో 23 వ వార్షికోత్సవ వన భోజన మహోత్సవము మరియు శ్రీ భద్రావతి సమేత బావనా ఋషి కళ్యాణోత్సవము శ్రీనివాస మంగాపురం లోని టీటీడీ కల్యాణ మండపంలో 03-11-2024 ( ఆదివారం )అద్భుతంగా జరిగినది. ఈ కార్యక్రమంలో తిరుపతి పద్మశాలి సంఘం తరఫున శ్రీ సేపూరి రామ్మోహన్ గారు ( ప్రెసిడెంట్), శ్రీ ఇప్పనపల్లి శేషయ్య గారు( సెక్రెటరీ), శ్రీ హేమాద్రి గారు ట్రెజరర్ మరియు గౌరవ అధ్యక్షులు, సభ్యులు , తిరుపతి పట్టణంతో పాటు సమీప గ్రామం అయిన రేణిగుంట, తిరుచానూరు, చంద్రగిరి మొదలగు గ్రామంలోని పద్మశాలి కుల బంధువులుఅందరూ హాజరై కార్యక్రమమును విజయవంతంగా జరిపినారు.
ఈ కార్యక్రమంలో తిరుపతి పట్టణ పద్మశాలి సేవా సంఘం యొక్క నూతన సంవత్సరము క్యాలెండర్-2025 ని ఆవిష్కరణ చేయడం జరిగినది. పద్మశాలి కుల బాంధవులు ఎవరైనా క్యాలెండర్ యొక్క సాఫ్ట్ కాపీని ప్రపంచంలో ఎక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు