Download Post
3 months, 4 weeks
పద్మశాలి ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్ర ప్రదేశ్ (PEWA-AP):
మన అసోసియేషన్ (PEWA) అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన 2025 డైరీ, క్యాలెండర్ ను కేంద్ర గ్రామీణ అభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖామాత్యులు శ్రీ పెమసాని చంద్రశేఖర్ గారిచే అత్యంత వైభవంగా ఆవిష్కరణ చేయబడ్డది.
ఈ కార్యక్రమంలో వేమూరు శాసనసభ్యులు శ్రీ నక్కా ఆనందబాబు, గుంటూరు, కృష్ణాజిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, రాష్ట్ర అధ్యక్షులు జివిఎస్ రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి శ్రీ ఎం శ్రీనివాసరావు, గుంటూరు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీ రాఘవయ్య, శ్రీ కే రవికుమార్, కోశాధికారి ఎన్ కోటి సత్యనారాయణ, గుంటూరు జిల్లా పద్మశాలి సంఘ అధ్యక్షులు శ్రీ ఈశ్వరరావు, కార్యదర్శి శ్రీ శ్రీనివాసు, బాలాజీ తెనాలి శాఖ బాధ్యులు శ్రీ ఎంవీఎస్ఎన్ ప్రసాద్, శ్రీ బీవీ సుబ్బారావు, శ్రీ టి రమేష్ తదితరులు పాల్గొన్నారు.