Download Post
1 day, 9 hours
తిరుపతి లో ఉన్న సరస్వతి శిశుమందర్ హై స్కూల్లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవాలు... 🇮🇳🇮🇳🇮🇳
ఈరోజు తిరుపతి లోని రైల్వే కాలనీ నందు వున్న శ్రీ సరస్వతి శిశుమందర్ హై స్కూల్ లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలలో వారి ఆహ్వానం మేరకు నేను పాల్గొన్నాను.
ఈ వేడుకలు కు ముఖ్య అతిధిలుగా జె పి డెంటల్ అధినేత జె.పి.జయ ప్రసాద్ గారు, ప్రత్యేక అతిధిలుగా బహు ముఖ విద్యావేత్త ప్రోప్సర్ శ్రీమతి రాజేశ్వరి గారు, బిజెపి సీనియర్ నాయకులు పోనగంటి భాస్కర్ గారు, కిట్టు ఖాధీబండార్ అధినేత విజయ కుమార్ గారు, అతిధిలుగా పాఠశాల అధ్యక్షులు డాక్టర్ హేమంత్ కుమార్ గారు, కార్యదర్శి రవి శంకర్ గారు, స్కూల్ ప్రధాన చార్యులు కె.నాగరాజు గారు, మరియు సరస్వతి శిశుమందర్ హై స్కూల్ జిల్లా అధ్యక్షులు గల్లా సురేష్ గారు, జిల్లా కార్యదర్శి రవి కుమార్ గారు, కోశాధికారి చంద్రశేఖర్ గారు పాల్గొన్నారు.
జాతీయ జండా ఎగరవేసి వందేమాతరం గీతలాపనతో జండా వందనం స్వీకరించారు.
తదనంతరం జరిగిన సభలో పోనగంటి భాస్కర్ గారు మాట్లాడుతూ
గౌరవనీయులైన పెద్దలకు,విద్యార్థి లకు, ఉపాధ్యాయ లకు, స్కూల్ సిబ్బంది కి, విచ్చేసిన అందరికీ 80వ స్వాతంత్య్ర దినోత్సవ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ రోజు మన భారతదేశ చరిత్రలో అత్యంత పవిత్రమైన రోజు అని,వందలాది సంవత్సరాల బానిసత్వ సంకెళ్లను తెంచి, మనకు స్వేచ్ఛాయుతమైన భారతాన్ని అందించడానికి ఎందరో మహానుభావులు, స్వాతంత్య్ర సమరయోధులు తమ
జీవితాలను, ప్రాణాలను త్యాగం చేశారు అని అమరవీరుల త్యాగాలకు నివాళి అని కొనియాడారు.
స్వాతంత్య్రం అంటే కేవలం జెండా ఎగురవేసి వేడుకలు జరుపుకోవడం మాత్రమే కాదు. నాటి వీరులు తెచ్చిన ఆ స్వేచ్ఛను సద్వినియోగం చేసుకుంటూ.. మన సమాజంలో ఉన్న పేదరికం, అసమానతలు, సమస్యలపై పోరాడటమే నిజమైన దేశభక్తి. ఒక పౌరుడు గా ప్రతి పేదవాడికి, కార్మికుడికి, కష్టాల్లో ఉన్న ప్రతీ ఒక్కరికీ అండగా నిలవడమే ప్రథమ కర్తవ్యం అన్నారు.
ఐక్యతతోనే ప్రగతి,భిన్నత్వంలో ఏకత్వమే మన భారతీయ సంస్కృతి. కుల, మత, వర్గ భేదాలను పక్కనపెట్టి మనమందరం ఒకే తాటిపై నిలబడి మన ప్రాంతాన్ని, మన దేశాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలి. ప్రతి ఒక్కరి ముఖంలో నవ్వు చూసినప్పుడే మనకు నిజమైన స్వాతంత్య్రం లభించినట్లు, మన జాతీయ పతాకం సదా గగనంలో ఎగురుతూనే ఉండాలి. మన సమైక్యత జగత్తుకే ఆదర్శంగా నిలవాలి అని పోనగంటి భాస్కర్ గారు కోరారు.
విద్యార్థులు లకు బహుమతులు ప్రదానం చేసారు.
విద్యార్థులు చే దేశభక్తి గీతాలు ఆలపించారు. మరియు విద్యార్థులు నృత్యం చేసి అందరిని ఆనదింపచేసారు.
జై హింద్... 🇮🇳🚩🇮🇳