జాతీయస్థాయి ఓపెన్ కరాటే పోటీలలో జొన్నాదుల మోహనసాయి కి స్వర్ణ పతకం

Download Post





11 months, 4 weeks

జాతీయస్థాయి ఓపెన్ కరాటే పోటీలలో జొన్నాదుల మోహనసాయి కి స్వర్ణ పతకం

SHITO -RYU-KAI INTERNATIONAL KARATE DO ACADEMY INDIA వారు  NTR మునిసిపల్ ఇండోర్ స్టేడియం, గుంటూరు నందు నిర్వహించిన జాతీయ స్థాయి ఓపెన్ కరాటే పోటీలలో మంగళగిరి కి చెందిన జొన్నాదుల మోహన సాయి ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకం గెలుపొందాడు, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ జొన్నాదుల మోహనసాయి కి అభినందనలు తెలియజేశారు

మంగళగిరి చేనేత కుటుంబానికి చెందిన జొన్నాదుల మోహన సాయి విజయవాడ పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజీలో బిటెక్ మొదటి సంవత్సరం చదువుతూ మంగళగిరి కి చెందిన కరాటే మాస్టర్ డి. ప్రభాకర్ వద్ద కరాటేలో శిక్షణ పొందుతున్నాడు,

 2024 సంవత్సరంలో జొన్నాదుల మోహన్ సాయి జాతీయస్థాయిలో వరుసగా 4 బంగారు పథకాలు సాధించడం విశేషం

CLASSIFIEDS