Download Post
5 months, 3 weeks
జై పద్మశాలి 🙏💐 జై మార్కండేయ🙏💐 🙏💐
ముఖ్య గమనిక : కర్నూలు నగరం పద్మశాలి కుల బాంధవులందరికీ తెలియజేయడమేమనగా! కర్నూలు పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నవంబర్ 17 వ తేదీ ఆదివారం నాడు పద్మశాలీయుల కార్తీక వనభోజనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం మీకు తెలిసినదే.ఈ సందర్భంగా మన పద్మశాలి బాల బాలికలకు కొన్ని పోటీలు నిర్వహిస్తున్నాము.ఇందులో బాల బాలికలు పాల్గొని, బహుమతులు గెలిచిన వారికి, వనభోజనం రోజున బహుమతులు అందజేయబడును. పోటీల వివరాలు కింది విధంగా ఉంటాయి.
1.భగవద్గీత శ్లోకాల పారాయణం: ఈ పోటీలో పాల్గొనే బాలబాలికలు , వారికి నచ్చిన, భగవద్గీతలోని శ్లోకాలను ఎంపిక చేసుకొని, నేర్చుకొని, భావంతో సహా పారాయణం చేయాలి.శ్లోకాలు రాసిన పేపరు జడ్జీలకు, ముందుగా అందజేయాలి.ఎక్కువ శ్లోకాలు చూడకుండా భావంతో సహా చెప్పిన బాలబాలికలను విజేతలుగా ఎంపిక చేయబడును.
2.వక్తృత్వము(Elocution): అంశం: "పద్మశాలి వంశ చరిత్ర" మన పద్మశాలీల వంశ చరిత్రను గురించి బాలబాలికలు ప్రసంగించవలెను.ఉత్తమ ప్రసంగం చేసిన బాల బాలికలను విజేతలుగా ఎంపిక చేయడం జరుగుతుంది.
3.పద్మశాలి రుషి గోత్రము, ల , పై క్విజ్ పోటీ: మన పద్మశాలి వంశవృక్షము, మరియు 101 రుషి నామములు, ఇంటి పేర్లు, గోత్రములు పై, క్విజ్ పోటీ నిర్వహించబడును.కావున 101 ఋషుల పేర్లు వారి గోత్రంతో వచ్చు ఇంటిపేర్లు పై అవగాహన కలిగి ఉన్న బాల బాలికలను విజేతలుగా ఎంపిక చేయబడును.
పోటీలు జరుగు స్థలము :శ్రీ భద్రావతి భావన ఋషి దేవాలయం, చిత్తారి వీధి, కర్నూలు.
పోటీలు జరుగుతేది: 9- 11- 2024,శనివారం ,ఉదయం 9 గంటల నుండి.
పోటీలలో పాల్గొను బాల బాలికలు వారి పేర్లను ఈ క్రింది వారికి ఫోను ద్వారా వాట్సాప్ చేయవలెను.రిజిస్టర్ చేయించవలెను .
1.మేడం సుంకన్న
8639386819
2.కస్తూరి ప్రసాద్
9966732986.
ధన్యవాదములుతో 🙏
ఇట్లు
శ్రీ కస్తూరి వేమయ్య అధ్యక్షుడు
పద్మశాలి సంఘం
కర్నూలు