గౌరవ శాసనసభ్యులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారికి ధర్మవరంలో బ్యాక్ వర్డ్ కమ్యూనిటీ సన్మాన సభ (04-01-2025)

Download Post





3 months, 3 weeks

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల లోని మొత్తం జనాభాలో, 61%  జనాభా కలిగిన బ్యాక్వర్డ్ కమ్యూనిటీ ప్రజలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా, అగ్రవర్ణ కులాలవారు త్రొక్కి పెట్టి, పదవులను అనుభవిస్తున్న విషయం అందరికీ తెలిసినదే.

 మొత్తం జనాభాలో  చేనేత రంగానికి చెందిన  జనాభా 20 శాతం ఉండగా, ఆంధ్రప్రదేశ్లో  తెలుగుదేశం పార్టీ జనాభా ప్రాతిపదికన, 30 అసెంబ్లీ నియోజకవర్గాలను చేనేత కమ్యూనిటీకి  కేటాయించవలసి ఉండగా, కేవలం ఒకే స్థానాన్ని  అనంతపురం జిల్లాలోని కదిరి నియోజకవర్గం, రెండున్నర దశాబ్దాలు  పైగా, పదవి ఉన్నప్పుడు లేనప్పుడు కూడా, కదిరి నియోజకవర్గ ప్రజలకు నిస్వార్థ  సేవ చేస్తున్న శ్రీ కందికుంట వెంకటప్రసాద్, కేటాయించడం, వారు గెలవడం తెలిసిన విషయమే. 

 దురదృష్టవశాత్తు కూటమి మంత్రివర్గంలో, చేనేత కమ్యూనిటీ తరఫున  గెలిచిన, ఏకైక  ఎమ్మెల్యే  కందికుంట వెంకటప్రసాద్ గారికి,  మంత్రివర్గంలో స్థానం కలుగుకుండా, త్రొక్కి పెట్టిన  అగ్రవర్ణ కుల ఆధిపత్యాన్ని, చేనేత కమ్యూనిటీ వర్గం ఖండిస్తున్నది.

 ఏమైనప్పటికీ, బీసీ కులాల  ప్రధాన కమ్యూనిటీ అయిన చేనేత కళాకారుల కమ్యూనిటీ ప్రజలు, తమ హక్కుల కోసం, రాజకీయ ప్రాధాన్యత కోసం, నిరంతరము పోరాడుతూనే ఉంటారు. వారి పోరాటాన్ని అగ్రవర్ణ కులాలు తెలుసుకోవాలి.
 
 కదిరి నియోజకవర్గ  గౌరవ శాసనసభ్యులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారికి, చేనేత కమ్యూనిటీ తో కలిపి ఈనెల  4 వ తేదీన,  ధర్మవరంలో   
బ్యాక్ వర్డ్ కమ్యూనిటీ ఏర్పాటుచేసిన  సన్మాన సభకు తరలివచ్చి,  కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా, రెండు రాష్ట్రాలలోని  బీసీ వర్గ కమ్యూనిటీ ప్రజలను కోరుచున్నాను.

 ఇట్లు,
 ఏవి రమణ రిటైర్డ్  డి ఎం ఓ, ఆప్కో,
 ప్రెసిడెంట్, 
 నేషనల్ హ్యాండ్లూమ్  అండ్ టెక్స్టైల్  పీపుల్ వెల్ఫేర్ కౌన్సిల్.