Download Post
5 months
పట్టుశాలి (హైదరాబాదు)
వారి కార్తీక వన సమారాధన
ఉల్లాసంగా ఉత్సాహంగా
ఆత్మీయంగా ఆనందంగా
సూపర్ హిట్!
AIWF న్యూస్, హైదరాబాద్:
నవంబర్ 24, 2024 ఆదివారం నాడు హైదరాబాద్ స్థానిక ఇందిరాపార్క్ లో పట్టుశాలి వారి కార్తీక వన సమారాధన పచ్చని ప్రకృతిలో అహ్లాదకర వాతావరణంలో ఆద్యంతం ఆనందంగా సాగింది.
హైదరాబాద్ మరియు వివిధ ప్రాంతాల నుండి పట్టుశాలీలు అధిక సంఖ్యలో పాల్గొని తమ చైతన్యాన్ని చాటారు. రకరకాల పాటలు ఆటలతో ఆనందంగా గడిపారు. వివిధ పోటీలలో పాల్గొని గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు.
కోరుకొండ శ్రీనివాసరావు గారు సభకు అధ్యక్షత వహించారు. బస్వ కృష్ణారావు గారు సమన్వయ కర్తగా వ్యవహరించారు.
డా. బాసబత్తిని రాజేశం,
వనం శాంతి కుమార్, రాపోలు జగన్,
పసలాది సబిత గారలు ఆత్మీయ
అతిథులుగా పాల్గొని చేనేతలంతా
చైతన్యంతో ఐక్యమై అభివృద్ధిని
సాధించాలని సందేశమిచ్చారు.
డా. బాసబత్తిని రాజేశం గారు
AIWF తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రతి చేనేత కులానికి అభ్యుదయానికి, వివిధ అవసరాలకు ఆత్మ గౌరవ భవనము అవసరమై ఉన్నదని, ప్రతి చేనేత కులానికి ఆత్మగౌరవ భవనానికి తగిన స్థలాన్ని, తగినన్ని నిధులు విడుదల చేయటానికి ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ ప్రభుత్వంతో తగిన విధంగా ప్రాతినిధ్యం చేస్తుందని, చేనేత కులాలన్నింటికీ ఆత్మగౌరవ భవనాలని సాధిస్తుందని,
రాష్ట్రంలో ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా చేనేతకుల అభ్యర్థులను తప్పనిసరిగా గెలిపించుకోవాలని, రాజ్యాధికారంలో భాగస్వాములు కావాలన్నారు.
శ్రీమతి పసలాది సబిత గారు
కోర్ మెంబర్ AIWF TGS...
మానవుల నిత్యావసర వస్తువుల్లో ఒకటైన వస్త్రాన్ని తయారుచేసి, మానవ నాగరికత పెంపొందించిన చేనేత వృత్తి కులమైన పట్టుశాలీలు నేడు విద్యా ఉద్యోగ వ్యాపార సాంస్కృతిక సాంఘిక ఆర్థిక రాజకీయ రంగాలలో అభివృద్ధి సాధించాలని, అంతరించి పోతున్న చేనేత కళను కాపాడుకోవాలని, ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించాలని, ఆదరించాలని కోరారు .
వనం శాంతి కుమార్ గారు
(కన్వీనర్ AIWF తెలంగాణ.
అధ్యక్షులు-తెలంగాణ రాష్ట్ర చేనేత
కార్మిక సంఘం)
చేనేత కులాలన్ని ఒక్కటే! చేనేతల కుల వృత్తి ఒకటే! ఆచార సాంప్రదాయ వ్యవహారాలు ఒక్కటే! చేనేత కులాలు పరస్పరం వియ్యమందుకోవాలి! వస్త్ర నిర్మాతలు నేడు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని రోజుకి కనీసం వంద రూపాయలు కూడా కూలీగా గిట్టటం లేదని, ఆత్మహత్యల బాట పడుతున్నారని, వెంటనే ప్రభుత్వము గతము లో ఉన్న సంక్షేమ పథకాలను అమలు చేసి చేనేత కార్మికులను, వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్లు మంజూరు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు
చేనేత కవి రాపోలు జగన్...
ఆలిండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ స్థాయిలో తొమ్మిది రాష్ట్రాల్లో విస్తరించి ఉందని, ప్రతి రాష్ట్రంలో చేనేత కులాల వారిని సంఘటితం చేస్తుందని, సకల రంగాలలో సమన్యాయం కోసం, చేనేత కళాకారులకు చేతినిండా పని, పనికి తగిన వేతనం కోసం మెరుగైన జీవనం కోసం పాటుపడుతుందని, ఫెడరేషన్ నిర్మాణంలో పట్టు శాలీలది ప్రశంసనీయమైన ప్రముఖ పాత్ర అన్నారు.
కోరుకొండ మురళీకృష్ణ, మందుల మనోహర్, పి ఉమేష్, పి. లోకనాథ్, చంద్రశేఖర్, జల్లేపల్లి మురళీధర్, పి. హేమ శేఖర్, బి. చంద్రశేఖర్, శ్రీధర్ బాబు, జి. ఆనందరావు (హైకోర్టు
అడ్వకేట్) గారలు మొదలైన వారు పాల్గొన్నారు.