Download Post
4 months, 2 weeks
కర్నూలు పద్మశాలీ సంఘం- కార్తీక వనభోజన మహోత్సవం- (09-11-2025- ఆదివారం)-
కర్నూలు నగరం సుంకేసుల రోడ్డులోని మాసా మసీదు పక్కనున్న ఎస్ఎల్ ఎన్ ఫంక్షన్ హాల్లో ఈ నెల 9న ఆదివారం 17fవ పద్మశాలియుల కార్తీక వనభోజన మహోత్సవం నిర్వహిస్తున్నట్లు పద్మశాలియుల నగర అధ్యక్షుడు కస్తూరి వేమయ్య , ప్రధాన కార్యదర్శి మేడం సుంకన్న , కోశాధికారి గుర్రం శివ ప్రసాద్, తెలిపారు. శుక్రవారం వారు మాట్లాడుతూ ఉదయం 8 గంటలకు ఉసిరి చెట్టుకు పూజ జరుగుతుందని, మహిళలందరు పూజా సామగ్రి తెచ్చుకోవాలని సూచించారు. పూజ అనంతరం అల్పాహారం ఉంటుందని పేర్కొన్నారు. ఆ తరువాత ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కుల పెద్దలకు , త్రి ఐటి, జేఈఈ, నీట్లో ర్యాంకులు సాధించిన పద్మశాలీయుల బిడ్డలకు ఘనంగా సన్మానిస్తామన్నారు. పద్మశాలీయులు అన్ని రంగాల్లో రాణించాలని, అందుకు సంఘం తరుపున ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. మధ్యాహ్నం 1 గంటకు భోజనం తరువాత క్రీడల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేస్తామన్నారు. నగరంలోని కుల బాంధవులు అందరూ పాల్గొని కార్తీక వన భోజన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా నగర అధ్యక్షుడు కస్తూరి వేమయ్య కోరారు. సమావేశంలో పద్మశాలియుల సంఘం నగర సభ్యులు క్యావర్శి గోవిందు, కస్తూరి ప్రసాద్, జేరుబండి హరి ప్రసాద్, శిరసాల లక్ష్మి నారాయణ, కాల్వ సంజీవ్ కుమార్, గోరంట్ల లక్ష్మి నారాయణ తదితరులు పాల్గొన్నారు.
కర్నూలు పద్మశాలి సేవా సంఘం ( Kurnool Padmshali Seva Sangham)
1.మేడం సుంకన్న (General Secratary)
2.శ్రీ కస్తూరి వేమయ్య (President)
All the members
ధన్యవాదములుతో 🙏
ఇట్లు
పద్మశాలి సంఘం
కర్నూలు