Download Post
1 day, 3 hours
ఘనంగా విజయవంతమైన "మన మహనీయుల పండుగ"
=============
--గుత్తికొండ ధనుంజయరావు,
కన్వీనర్: మంగళగిరి సాహితీ కళావేదిక.
<<<<<<<<>>>>>>>
ఆనందంతోపరవశించిన తల్లిదండ్రులు, విద్యార్థులు మేధావులు.....
ఫలించిన ప్రజా, కళా, సాహితీ, అభ్యుదయ సంస్థల కృషి...
గతంలో మునుపు ఎన్నడూ దేశంలో ఇటువంటి కార్యక్రమం జరగలేదని, ఈ కార్యక్రమం మాకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని, మన మహనీయుల పండుగ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరి నోట ఇదే మాట...
ఆదివారం ఉదయం 9 గంటలకు ధ్యానరత్న ఆకురాతి శంకరరావు గారి సారధ్యంలో చేపట్టిన 40 నిమిషాల పాటు ధ్యాన కార్యక్రమం అనంతరం 9 గంటల 40 నిమిషాలకు మన మహనీయుల పండుగ సందర్భంగా ఏర్పాటుచేసిన భారతదేశ తత్వవేత్తలు, మహాత్ములు, మహనీయులు, స్వాతంత్ర సమరయోధులు, ఈ దేశం కోసం అహర్నిశలు శ్రమించిన మహనీయులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు ఇంకా అనేకమంది మహనీయుల త్యాగాలను స్మరించేందుకు ఏర్పాటు చేసిన ఈ పండగ ఫోటో ఎగ్జిబిషన్ ను ఒక మంచి మానవతావాది శ్రీ జంగాల సాంబశివరావు గారు ప్రారంభించడం సంతోషించు తగ్గ పరిణామం..
ఈ ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించిన వందలాదిమంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, మేధావులు అందరూ వాటిని తమ కెమెరాలలో బంధించారు.ఈ ఫోటో ఎగ్జిబిషన్ కోసం అనేక రోజులుగా ఎంతో శ్రమించి ఫొటోస్ సేకరించి, ఆ మహనీయుల త్యాగాలను అక్షరాల రూపంలో ముద్రించిన మంగళగిరి సాహితీ కళావేదిక గౌరవ సభ్యులు యువకుడు ఉత్సాహవంతుడు ఏ పనైనా బాధ్యతగా చక్కగా చక్కబెట్టే మా రేకా నరేష్ బాబు కృషి అభినందనీయం....
అనంతరం 10 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమైనాయి. మంగళగిరి వి,.టి.జే.యం అండ్ ఐ వి టి ఆర్ డిగ్రీ కళాశాల కళావేదికపై ఈ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. మన మహనీయుల పండగ రూపకర్త ఎన్నో రోజులుగా మన మంగళగిరిలో మన మహనీయుల పండుగను ఏర్పాటు చేయాలన్న కృత నిశ్చయంతో శ్రమించిన పెద్దలు, మానవ వికాస మండలి అధ్యక్షులు రేకా కృష్ణార్జునరావు గారి కృషి ఫలించి, డిగ్రీ కాలేజీ ఫంక్షన్ హాల్ కిక్కిరిసిపోయి, అతి పెద్ద పండుగగా ఈ కార్యక్రమం అవతరించింది.
మరో ప్రక్క కార్యక్రమానికి హాజరైన అనేకమంది మన ఆడపడుచులు తాము సొంతంగా తయారు చేసిన పిండి వంటలను తీసుకొచ్చి , ప్రదర్శనగా ఉంచి అందరికీ ప్రేమతో పంచటం ఒక మంచి వాతావరణం ఏర్పడింది.
కార్యక్రమానికి అధ్యక్షులుగా మంగళగిరి సాహితీ కళావేదిక కన్వీనర్ గుత్తికొండ ధనుంజయరావు, మరియు విశ్వశాంతి కళాపరిషత్ అధ్యక్షులు పొట్లాబత్తుని లక్ష్మణరావు, ఆకురాతి శంకర్రావు కార్యక్రమాన్ని నడిపించగా... ముందుగా మన భారతీయుల పూజనీయ చిత్రపటానికి మిత్రులు, ఆదర్శవాది, మంచి మనసున్న శ్రీ తాటిపాముల లక్ష్మీ పెరుమాళ్లు గారు పూలమాలవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మన మహనీయుల పండుగ సందర్భంగా అక్కడికి విచ్చేసిన వివిధ మతాల వేషధారణలతో ముద్దు ముద్దుగా ఉన్న చిన్నారుల చేత జ్యోతి ప్రజ్వలన గావించటం ఆహుతులను ఆనందింపజేసింది. అంతేకాకుండా మన మహనీయుల పండుగ సందర్భంగా కేక్ కట్ చేయడం కూడా జరిగింది.
అనంతరం మంగళగిరి ప్రాంతంలోని అనేక ప్రైవేటు పాఠశాలలు, హై స్కూల్స్, కాలేజీల విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొని మన మహనీయులు ఎవరైతే ఉన్నారో వారి వేషధారణలతో ఆ ఫంక్షన్ హాల్ నందు ఒక్కరొక్కరుగా తమ అద్భుతమైన ఏకపాత్రాభినయాలు, నృత్య రూపకాలు, దేశభక్తి గేయాలు, మహనీయుల త్యాగాలను కళ్ళ ముందు ఉంచారు. ఇది ఒక అద్భుతమైన పండుగగా అక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరు సంతోషంగా తిలకించారంటే నిర్వాహకుల మనసులు ఎంత ఆనందంతో నిండిపోయాయో వారి ముఖాల్లో స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా మన మహనీయుల గురించి వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు గారి ప్రసంగం అందరి మనసులను తాకింది ఎందుకు మహనీయుల పండుగ మనం చేసుకోవాలి?, వారు ఈ దేశం కోసం ఏం చేశారు?. ఈ ప్రపంచానికి భారతదేశ ఔన్యత్యాన్ని ఏ విధంగా చాటారు? ఎందుకు ఈరోజు మంగళగిరిలో ఎక్కడా జరగని రీతిలో మన మహనీయుల పండుగను ఎందుకు జరుపుతున్నారు? అనే విషయాలను వివరిస్తూ ఆయన చెప్పిన మాటలు ప్రతి హృదయాన్ని కదిలించాయి అని చెప్పాలి. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థులలో ఆలోచన కలగజేస్తాయి దేశం పట్ల వారికి గౌరవప్రదమైనటువంటి భక్తి భావం ఏర్పడుతుందని డాక్టర్ సుబ్బారావు గారు అనేక విషయాలు తెలియజేశారు.
విద్యార్థినీ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలను ప్రైవేట్ స్కూల్స్ అసోషియేషన్ నాయకులు జి ఎస్ బాబా గారు, మరియు శిందె కృష్ణ ప్రసాద్ గారు చాలా మైత్రీ పూర్వకంగా, చాలా నైపుణ్యంగా, నిర్వహించి అందరి ప్రశంసలు పొందారు.
కార్యక్రమం ఉదయం 9 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు ఎంతో ఉత్సాహంగా విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పట్టణ ప్రజలు, వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన మేధావులు పాల్గొనటం విశేషం.
ఈ కార్యక్రమంలో డాక్టర్ గోలి రామ్మోహన్ రావు గారు, డాక్టర్ బాల వెంకట్రావు గారు, జొన్నాదులు బాబు శివప్రసాద్ గారు, నన్నపనేని నాగేశ్వరరావు గారు ఇంకా అనేక మంది పెద్దలు వచ్చి కార్యక్రమాన్ని తిలకించి విద్యార్థినీ విద్యార్థులను ఆశీర్వదించటం ఆనందదాయకం.
కార్యక్రమ ప్రారంభంలో గాయని కౌతరపు కవిత, కౌతవరపు రామచంద్ర రావు గారు, పొట్లాబత్తుని లక్ష్మణరావు గారు సందుపట్ల భూపతి గారు, కోట వెంకటేశ్వరరెడ్డి గారు, చిలకా దేవి పద్మ గారు పాడిన గేయాలు అక్కడికి విచ్చేసిన అందరిని కూడా ఆనందంపజేశాయి..
ఇంతటి మహా కార్యక్రమానికి ఎంతో మంది పెద్దల ఆర్థిక సహకారం నిర్వహకులకు ధైర్యాన్ని నింపింది. వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు... సిందే బాలకృష్ణ మాస్టారు గారి సూచన మేరకు అన్ని పాఠశాల, హైస్కూల్, కళాశాల విద్యార్థులు ఇంత పెద్ద కార్యక్రమంలో పాల్గొని మంచి మనసుతో ఓర్పుతో పాల్గొనటం మాకు ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చింది.
ఈరోజు రాష్ట్రంలో ఒక మంచి స్థానాన్ని ఏర్పరచుకున్న మా మిత్రులు మంగళగిరి కవితా ధ్వని గోలి మధు గారి సహకారం అభినందనీయం..
కార్యక్రమం మొదటి నుంచి చివరి వరకు తన సహకారాన్ని అందించిన మంగళగిరి సాహితి కళావేదిక బాధ్యులు చిలకా శ్రీధర్ కి ప్రత్యేక అభినందనలు
అంతేకాదు గాన గంధర్వుడు ప్రజానాట్యమండలి కళాకారుడు కంచర్ల కాశయ్య గారి సహకారం మరువలేనిది.
ముఖ్యంగా ఏ కార్యక్రమం చేపట్టిన ఆ కార్యక్రమానికి పెద్దదిక్కు అందులో, నిరంతరం మా వెంట ఉండి నడిపించే మా మార్గదర్శకులు, నేడు ఎంతో విజయవంత మైనటువంటి మన మహనీయుల పండుగ రూప కల్పన చేసిన పెద్దలు మానవ వికాస మండలి అధ్యక్షుడు రేకా కృష్ణార్జునరావు గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు...
ఈ కార్యక్రమానికి సహకరించిన, పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు..
అభినందనలతో...
గుత్తికొండ ధనుంజయరావు
కన్వీనర్:
మంగళగిరి సాహితీ కళావేదిక.