Download Post
4 months, 3 weeks
ఈరోజు మార్కాపురంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో జరిగిన సమావేశం పాత కమిటీ రద్దును తెలియజేస్తూ...నూతన కమిటీ నిర్మాణం గురించి చర్చ తదుపరి జరిగిన నూతన కమిటీ నిర్మాణం కొరకు 9 మంది సభ్యులతో ఎలక్షన్ కమిటీ తీర్మానం జరిగినది...మార్కాపురం భక్త మార్కండేయ పద్మశాలి బహుత్తమ సేవా సంఘం నూతన సంఘ నిర్మాణం కొరకు సమన్వయ కమిటీ సభ్యులుగా అందరి ఏకాభిప్రాయ తీర్మానంతో ఏర్పడినటువంటి నూతన ఎలక్షన్ గౌరవ కమిటీ సభ్యులు...
1. శ్రీ అవ్వారి.నరసింహులు గారు.
2.శ్రీనారాయణ.శ్రీరామచంద్రమూర్తి గారు.
3. తనికంటి.శంకర్ గారు.
4. అనుముల రామయ్య గారు.
5. కందగట్ల.వెంకటస్వామి గారు.
6. ప్రగడ.లక్ష్మయ్య గారు.
7. గోపిశెట్టి రామాంజనేయులుఋషి గారు.
8. అనుముల.కేశన్న గారు.
9. ప్రగడ శ్రీనివాసులు గారు.
ఈ తొమ్మిది మందితో ఏర్పడిన కమిటీ బాధ్యతలు ముందుగా మార్కాపురం పట్టణ మరియు అనుసంధానమైన గ్రామాల పద్మశాలి కుల బాంధవులకు నూతన కమిటీ ఏర్పడుతుంది ఆ కమిటీలో ముఖ్యంగా 1).అధ్యక్ష,2).ప్రధానకార్యదర్శి 3).కోశాధికారులగా బాధ్యత చేపట్టడానికి మార్కాపురం పద్మశాలి లందరూ కూడా అర్హులుగా తెలుపుతూ... ఈ నూతన ఎలక్షన్ కమిటీ సూచన ఈ సంఘ బాధ్యతలు చేపట్టడానికి ముందుగా సంఘ సభ్యులై ఉండాలి 18 సంవత్సరాలు పైబడిన ఎవరైనా సరే బాధ్యత చేపట్టడాన్ని అర్హులుగా తెలుపుతూ...మీరు చేపట్టబోయే బాధ్యతను,మీరు చేసే సేవా కార్యక్రమాలు అభ్యర్థన రూపంలో ఈ మా కమిటీకి తెలియచేయాలని తెలుపుతూ ఈ మూడు పదవులకు అందరికీ అవకాశం ఇస్తున్నాము.
కావున సంఘ నాయకత్వం చేపట్టబోయే కుల బాంధవులారా ఈ బాధ్యతలు చేపట్టేవారు ముందుగా మీరు కుల సంఘాలలో వివిధ రూపాలలో మీ సేవా కార్యక్రమాలు తెలుపుతూ అభ్యర్థన ద్వారా తెలియజేయగలరని ఈ నూతన కమిటీ ద్వారా మీకు మరొకసారి తెలియజేయుచున్నాము.
త్వరలో అధికారికంగా ఈ కమిటీ ద్వారా ప్రతి కుటుంబానికి ఈ విషయాన్ని తెలియచేస్తూ ఒక సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయబోతున్నాము ఆ సమావేశంలో సభ్యుల పోటీనిబట్టి తదుపరి విషయాలను వెల్లడిస్తాము. 💐🙏
ఈ తొమ్మిది మందితో కమిటీ ఏర్పడినందుకు కమిటీ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ... ఏ కమిటీ తీర్మానానికి ఏకాభిప్రాయం తెలిపిన మార్కాపురం పద్మశాలి కుల బాంధవులందరి పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేయుచున్నాము....
ఇట్లు...
మార్కాపురం శ్రీ భక్త మార్కండేయ పద్మశాలీయ బహుత్తమ సేవా సంఘం