పద్మశాలి కుల బాంధవులారా విభజించి మనం చేసే కార్యక్రమాలు , మన జాతికి తీవ్ర నష్టం జరుగుతుంది మన ఐక్యతే మన విజయం.

Download Post





1 year, 4 months

పద్మశాలి కుల బాంధవులారా విభజించి మనం చేసే కార్యక్రమాలు మనం ఆనందం పొందవచ్చునేమో కానీ 🎙️మన జాతికి తీవ్ర నష్టం జరుగుతుంది మన ఐక్యతే మన విజయం...✊🚩

పద్మశాలి లందరూ గమనించాలి ఇలా ఒక్కొక్క ఇంటి పేరుతో వనభోజన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ మన ఐక్యతను మన బలాన్ని పూర్తిగా మనమే తగ్గించుకోవడంలో ప్రధమ పాత్ర వహిస్తున్నట్లే...

దయచేసి కుల బంధువులారా వనభోజన కార్యక్రమాలలో ఒక ఇంటి పేరుతో వన మహోత్సవం జరుపుతూ మిగతా పద్మశాలీలను దూరం పెట్టడం మంచి సంస్కృతి కాదు...అలా చేయడంవల్ల మన ఐక్యతకి విఘాతం కలుగుతుంది మన అభివృద్ధి కొంటూ పడటం ఖాయం దయచేసి గమనించి ఇలాంటి కార్యక్రమాలకు స్వస్తి పలకాలని ఒక పద్మశాలి కులవబంధువునిగా చేతులు జోడించి ఇలాంటి కార్యక్రమాలు ఇకమీదట జరుపుకోకుండా  విరమించుకోవాలని మన ఐక్యతను చిన్నాభిన్నం చేసే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టకుండా ఉండాలని ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించే కుల బాంధవులందరికీ శిరస్సు వంచి  పాదాలకు నమస్కరిస్తూ తెలియజేయుచున్నాను...ఇలా విడివిడిగా జరుపుకునే సంస్కృతి మంచిది కాదు అని రాష్ట్రవ్యాప్తంగా చాలామంది నాకు ఫోన్ చేసి మన ఐక్యతకు విఘాతం కలుగుతుంది రాష్ట్ర సంఘాల ద్వారా అందరికీ అవగాహన కల్పించాలని వారి యొక్క ఆవేదనను తెలియజేశారు పద్మశాలి సమాజ పక్షాన  తెలియజేయుచున్నాము.🙏🙏🙏

పద్మశాలి కులమందవులారా దయచేసి ఈ విషయాన్ని అన్యదగా భావించకుండా మన పద్మశాలి సమాజ శ్రేయస్సు కొరకు పాటుపడాలని తెలుపుతూ మీరు తీసుకునే కొన్ని నిర్ణయంపై కూడా మన పద్మశాలీయుల అభివృద్ధి ఆధారపడి ఉందని గమనించి సమాజమేలు కోసం చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని మన సమాజాన్ని బలహీనపరిచే ఇలాంటి కార్యక్రమాలకు స్వస్తి పలకాలని నమస్కరిస్తూ తెలియజేయుచున్నాము 🙏

ఇట్లు...
APPYS రాష్ట్ర ప్రతినిధి
శ్రీ గోపిశెట్టి రామాంజనేయులు ఋషి,ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన ✊🚩

 

About The Author

కొత్తగా మన గ్రూపులో యాడ్ అయిన మిత్రులకు స్వాగతం సుమాంజలు తెలియజేసుకుంటూ ..
గ్రూప్ యొక్క ముఖ్య ఉద్దేశాలు మిత్రులకు తెలియజేస్తున్నాము ...

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన గ్రూపుకు అనుబంధంగా మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పద్మశాలి యువసేన గ్రూపు ఏర్పడి ఉంది. ఈ గ్రూపు యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏమిటి అనగా పద్మశాలి సోదరులు యువత అంతా ఐకమత్యంగా కలిసిమెలిసి ఉండడానికి, మన పద్మశాలి సోదరులకు ఏ కష్టం వచ్చినా మన వంతు సహాయ సహకారాలు అందించడానికి ,చేయి చేయి కలిస్తేనే ఏదైనా సాధించగలం .
గడ్డిపరకలన్నీ ఈ ఏకమైతే మదపటేనుగు ను కూడా బంధించవచ్చు అనే విషయం మనందరికీ తెలుసు.
 అదేవిధంగా మన పద్మశాలి కులంలో ఉన్న సోదరులకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఏమైనా ఎదురైనప్పుడు మన సోదరులందరూ కలిసికట్టుగా ఐకమత్యంగా ఉండి వారి యొక్క సమస్యను పరిష్కరించుకో వడం కోసం ఏర్పాటు చేసిన గ్రూపు .

ముఖ్యంగా సోదరులు తెలుసుకోవలసిన విషయం ఏమిటి అనగా ఈ గ్రూపులో గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ ,పెళ్లిరోజు, తదితర మెసేజ్లు పెట్టవద్దు .

ఏదైనా మన పద్మశాలి కులానికి ,యువతకు ఉపయోగపడే మెసేజ్లు మాత్రమే పోస్ట్ చేయగలరు. అలా కానియడల మీరు ఏదైనా మనకు సంబంధం లేని మెసేజ్లు పెట్టిన యెడల డిలీట్ చేసే అధికారం అడ్మిన్ లకు ఉన్నది .
మా పోస్ట్ డిలీట్ చేశారు అని అన్యధా భావించవద్దు.

 ఏదైనా మనమంతా ఐకమత్యంతో ముందుకు సాగడం కోసం ఏర్పాటు చేసిన గ్రూపు.
 ఈ గ్రూపులో రాజకీయ ప్రస్తావనలకు తావు ఇవ్వరాదు ఎందుకనగా సోదరులు ఎవరికి నచ్చిన పార్టీలో వారు కొనసాగుతూ ఉంటారు పార్టీలపరంగా విడిపోవద్దు .
పద్మశాలి కులం పరంగా మనందరం ఒక్కటే అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉండాలని ఈ గ్రూపు యొక్క ముఖ్య ఉద్దేశం .

కాబట్టి రాజకీయ ప్రస్తావనలు మన గ్రూపులో తీసుకురావద్దు అని సోదరులకు తెలియజేసుకుంటూ ....

జై మార్కండేయ  
జై పద్మశాలి

View Profile

CLASSIFIEDS