Download Post
1 year, 4 months
మంగళగిరి నుంచి టీటీడీ బోర్డు సభ్యురాలిగా తమ్మిశెట్టి జానకిదేవి
టీటీడీ బోర్డులో మంగళగిరికి చెందిన తమ్మిశెట్టి జానకిదేవి (పద్మశాలీయ)కి అవకాశం లభించింది. ఆమె రాజకీయ ప్రస్థానం బీజేపితో ప్రారంభమైంది. ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో చేరి, మంగళగిరి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటి చేసి ఓడిపోయారు. ఆ తరువాత టీడీపీలో చేరి, పార్టీ కోసం, ముఖ్యంగా లోకేష్ విజయం కోసం కృషి చేశారు.ఆమె కష్టాన్ని గుర్తించిన తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు యువ నాయకులు ఐటి శాఖ మంత్రివర్యులు లోకేష్ గారు జానకి దేవి గారికి టిడిడి బోర్డు నెంబర్ గా ఇవ్వడం పట్ల, అన్నీ పద్మశాలి సంఘాలు హర్షంను వ్యక్తపరుస్తన్నాయి.
శ్రీ తమ్మిశెట్టి జానకిదేవి గారికి పద్మశాలి కులబాంధవులు అందరి తరుపున శుభాకాంక్షలు💐💐💐
కొత్తగా మన గ్రూపులో యాడ్ అయిన మిత్రులకు స్వాగతం సుమాంజలు తెలియజేసుకుంటూ ..
గ్రూప్ యొక్క ముఖ్య ఉద్దేశాలు మిత్రులకు తెలియజేస్తున్నాము ...
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన గ్రూపుకు అనుబంధంగా మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పద్మశాలి యువసేన గ్రూపు ఏర్పడి ఉంది. ఈ గ్రూపు యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏమిటి అనగా పద్మశాలి సోదరులు యువత అంతా ఐకమత్యంగా కలిసిమెలిసి ఉండడానికి, మన పద్మశాలి సోదరులకు ఏ కష్టం వచ్చినా మన వంతు సహాయ సహకారాలు అందించడానికి ,చేయి చేయి కలిస్తేనే ఏదైనా సాధించగలం .
గడ్డిపరకలన్నీ ఈ ఏకమైతే మదపటేనుగు ను కూడా బంధించవచ్చు అనే విషయం మనందరికీ తెలుసు.
అదేవిధంగా మన పద్మశాలి కులంలో ఉన్న సోదరులకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఏమైనా ఎదురైనప్పుడు మన సోదరులందరూ కలిసికట్టుగా ఐకమత్యంగా ఉండి వారి యొక్క సమస్యను పరిష్కరించుకో వడం కోసం ఏర్పాటు చేసిన గ్రూపు .
ముఖ్యంగా సోదరులు తెలుసుకోవలసిన విషయం ఏమిటి అనగా ఈ గ్రూపులో గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ ,పెళ్లిరోజు, తదితర మెసేజ్లు పెట్టవద్దు .
ఏదైనా మన పద్మశాలి కులానికి ,యువతకు ఉపయోగపడే మెసేజ్లు మాత్రమే పోస్ట్ చేయగలరు. అలా కానియడల మీరు ఏదైనా మనకు సంబంధం లేని మెసేజ్లు పెట్టిన యెడల డిలీట్ చేసే అధికారం అడ్మిన్ లకు ఉన్నది .
మా పోస్ట్ డిలీట్ చేశారు అని అన్యధా భావించవద్దు.
ఏదైనా మనమంతా ఐకమత్యంతో ముందుకు సాగడం కోసం ఏర్పాటు చేసిన గ్రూపు.
ఈ గ్రూపులో రాజకీయ ప్రస్తావనలకు తావు ఇవ్వరాదు ఎందుకనగా సోదరులు ఎవరికి నచ్చిన పార్టీలో వారు కొనసాగుతూ ఉంటారు పార్టీలపరంగా విడిపోవద్దు .
పద్మశాలి కులం పరంగా మనందరం ఒక్కటే అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉండాలని ఈ గ్రూపు యొక్క ముఖ్య ఉద్దేశం .
కాబట్టి రాజకీయ ప్రస్తావనలు మన గ్రూపులో తీసుకురావద్దు అని సోదరులకు తెలియజేసుకుంటూ ....
జై మార్కండేయ
జై పద్మశాలి