Download Post
1 day, 11 hours
తిరుపతి లో ఘనంగా నగర సంకీర్తన... 🚩
ఈరోజు 29-08-2026 (శనివారం) ఉదయం 5: 45 గంటలకు గోవిందరాజ స్వామి తిరుమాడవీధుల్లో నగర సంకీర్తన నిర్వహించారు.
గోవిందరాజ స్వామి ఆలయం ఎదురుగా ఉన్న ఆంజనేయస్వామి ఆలయం నుండి ప్రారంభం అయి గోవిందరాజ స్వామి ఆలయం తిరుమాడ వీధులలో నగర సంకీర్తన నిర్వహించారు.
తెలుగు బాషా దినోత్సవం సందర్భంగా గాంధీ రోడ్డు చివరిన గిడుగు రామ మూర్తి గారి చిత్ర పటం కు పూలమాలలు వేసి పుష్పములతో ఘనంగా నివాళులు అర్పించారు.
గుండాల గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పీవీఎన్ మాధవ్ గారు , బిజెపి నాయకులు కోలా ఆనంద్ గారు, నాగోతు రమేష్ నాయుడు గారు, జల్లి మధుసూదన్ గారు, బిజెపి సీనియర్ నాయకులు పోనగంటి భాస్కర్ గారు, డాక్టర్ నరేష్ కుమార్ గారు, రెడ్డి బాబు, ప్రభాకర్ నాయుడు, రామ కుమార్ నాడర్, కరుణాకర్ రెడ్డి, భజన భక్తమండలి సభ్యులు, తిరుపతి నగర ప్రజలు, తదితరులు,అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసారు... 💐🙏