ధర్మసాగర్ లో వన భోజనాల కార్యక్రమం ఘనంగా నిర్వహించిన పద్మశాలి సంఘం

Download Post





5 months

ధర్మసాగర్ లో వన భోజనాల కార్యక్రమం ఘనంగా నిర్వహించిన పద్మశాలి సంఘం...

ఈ రోజు హన్మకొండ జిల్లాలోని ధర్మసాగర్ మార్కండేయ స్వామి ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్తీక మాస వనభోజన కార్యక్రమం నిర్వాహకులు రాష్ట్ర ఉపాధ్యక్షులు గుర్రపు రమేశ్వర్ రావు గారు మరియు రాష్ట్ర కార్యదర్శి గుర్రపు ప్రసాద్ గారు, ఇట్టి కార్యక్రమానికి చందా మల్లయ్య గారు హన్మకొండ జిల్లా అధ్యక్షులు సభాధ్యక్షులు వహించారు.
శ్రీ భక్త మార్కండేయ స్వామి పూజతో పాటు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారభించిన రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు వల్లకటి రాజ్ కుమార్ గారు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పద్మాశాలీలు చైతన్యం కావలసిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ప్రతి రంగంలో అభివృద్ధి చెందాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కమిటీలను బలోపేతం చేసి విభాగ సంఘాలను ఏర్పాటు చేస్తామన్నారు.
తెలంగాణ లో జరిగిన రాష్ట అధ్యక్షుని ఎన్నికలు నిర్వహించిన ఏకైక సంఘం తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘమని, పద్మశాలీలను ఏకీకృతం చేయటం జరుగుతుందని అన్నారు. వచ్చే స్థానిక ఎన్నికల బరిలో నిలబడే ఆశావహులకు సపోర్టు చేసి వారి విజయానికి రాష్ట్ర కమిటీ కృషి చేస్తుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (కార్యాలయం) గంజి శ్రీనివాస్ గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వేముల బాలరాజు గారు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు దుస్స శివశంకర్ గారు, రాష్ట్ర ఐక్య వేదిక అధ్యక్షులు రాపోలు వీరమోహన్ గారు, మెదక్ జిల్లా అధ్యక్షులు మ్యాకల జయరాములు గారు, రాష్ట్ర నాయకులు పెండెం శివానంద్, వలపుదాసు శ్యాంసుందర్, ఎర్రగుంట్ల శ్రీనివాస్, జోగి సూర్యప్రకాష్, మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, వందలాది పద్మశాలి కులబంధువులు తదితరులు పాల్గొన్నారు.