Download Post
4 months, 4 weeks
పద్మశాలీలు అన్ని రంగాల్లో ఎదగాలి~ పద్మశాలి సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పోతుల లక్ష్మీనరసింహులు : పద్మశాలీలు రాజకీయపరంగా మరియు అన్ని రంగాల్లో ఎదగాలని పద్మశాలి సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పోతుల లక్ష్మీనరసింహులు పేర్కొన్నారు. గురువారం ఉదయం యాడికి మార్కండేయ స్వామి దేవాలయంలో ఏర్పాటుచేసిన పద్మశాలియ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు, సంఘసంస్కర్త జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రప టానికి పూలమాలవేసి నివాళులర్పించారు, అనంతరం పి,లక్ష్మినరసింహులు గారిని శాలువాతో పద్మశాలీలు ఘనంగా సత్కరించారు, అనంతరం పోతుల లక్ష్మినరసింహులు మాట్లాడుతూ పద్మశాలీలు ప్రతి రంగంలో ఎదగాలని చేనేత వృత్తే కాకుండా పిల్లల చదువులు, ఉద్యోగాలలో, రాజకీయపరంగా ఎదగాలన్న రు, చేనేత రంగంలో ఎలాంటి సమస్యలు ఉన్నా మాకు తెలియజేస్తే పరిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు, మీలాంటి పెద్దల సహకారముతో నేను ఇంత రాష్ట్ర స్థాయి డైరెక్టర్ అయ్యానని గుర్తు చేశారు, ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు పుత్తా ఎర్రి స్వామి, సహాయ కార్యదర్శి జక్కా వెంకటరామయ్య,కార్యదర్శి జాన పాటి సత్యనారాయణ, యాడికి పద్మశాలి సంఘం ప్రెసిడెంట్ స్వామి, వైస్ ప్రెసిడెంట్ కాల్వ శ్రీనివాసులు, కోశాధికారి పణి బాబు, సెక్రెటరీ నాగ రంగయ్య, జాయింట్ సెక్రటరీ జయప్రసాద్ ప్రింటింగ్ ప్రెస్ శ్రీనివాసులు, లోక, నాగేషు, పద్మశాలియ సంఘం సభ్యులుపాల్గొన్నారు,