Download Post
5 months, 4 weeks
పరాల వెంకట సుబ్రహ్మణ్యం s/o సుబ్బారావు , గణిత శాస్త్రంలో డాక్టరేట్ పొందిన పద్మశాలి ముద్దు బిడ్డ
చీమకుర్తి: యోగి వేమన విశ్వవిద్యాలయం నుండి అనువర్తిత గణిత శాస్త్ర పరిశోధకుడు చీమకుర్తిపట్టణానికి కి చెందిన పరాల వెంకట సుబ్రహ్మణ్యం s/o సుబ్బారావు (చేనేత కార్మికులు) కు విశ్వవిద్యాలయం డాక్టరేట్ ను ప్రధానం చేసింది. అనువర్తిత గణిత శాస్త్ర (అప్లైడ్ మ్యాథ్స్) విభాగంలో ఆచార్యులు ప్రొఫెసర్. జి.కాత్యాయని పర్యవేక్షణలో "కన్వెక్టివ్ హీట్ అండ్ మాస్టర్ ట్రాన్స్ఫర్ ఫ్లో ఆఫ్ నానోఫ్లూయడ్స్" అనే అంశంపై చేసిన పరిశోధనకు గాను ఆయనకు డాక్టరేట్ ప్రధానం చేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య ప్రొఫెసర్. కె.ఎస్.వి.కృష్ణారావు ప్రకటించారు. పరాల వెంకట సుబ్రహ్మణ్యం యమ్.ఎస్.సి గణితశాస్త్రం ఆంధ్ర యూనివర్సిటీలో చదివి రాష్ట్రస్థాయి అర్హత పరీక్ష స్లెట్ క్వాలిఫై అయ్యారు. ఈ అప్లైడ్ మ్యాథ్స్ పరిశోధన వలన ఆటోమొబైల్ పరిశ్రమ, రసాయన పరిశ్రమ మరియు ముడిచమరు శుద్ధీకరణలో అనేక అనువర్తనాలను (ఉపయోగాలు) కలిగి ఉన్నది.
గత 5 సంవత్సరాలనుండి కడప జిల్లాలోని ఇడుపులపాయ నందు మాథ్స్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన... APPYS పక్షాన అభినందనలు తెలియజేయుచున్నాము💐🙏
బాలసుబ్రమణ్యం అవ్వారు---www.mutyam.in తరుపున అభినందనలు తెలియజేయుచున్నాru💐🙏