All Posts
Home Page
Padmashali International Welfare Association PIWA (పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్)
Download Post
1 month
పేద చేనేత కుటుంబాలను ఆదుకోవడమే piwa లక్ష్యం
పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ కేంద్ర కమిటీ అధ్యక్షులు స్వర్గం పుల్లారావు
పద్మశాలి చేనేత కుటుంబాల్లోని విద్యార్థులను మరియు ఆపదలో ఉన్న కుటుంబాలను ఆదుకోవడమే లక్ష్యంగా పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ పనిచేస్తుందని piwa కేంద్ర కమిటీ అధ్యక్షులు స్వర్గం పుల్లారావు అన్నారు. ది 20-10-2025 సోమవారం ఉదయం 10 గంటలకు మంగళగిరి కోలనకొండ వద్ద నిర్మితమవుతున్న piwa పద్మశాలి భవన్ వద్ద పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ మంగళగిరి బ్రాంచ్ ఆధ్వర్యంలో బ్రాంచ్ అధ్యక్షులు తాటిపాముల లక్ష్మీ పెరుమాళ్ళు 6గురు పేద చేనేత కుటుంబాలకు చెందిన విద్యార్థిని విద్యార్థులకు 1: 56:000 వేల రూపాయలు ఖరీదు చేసే రెండు లాప్టాప్ లు, ఉపకార వేతనాలు పంపిణీ చేసే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై పుల్లారావు గారు మాట్లాడారు. పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏ లక్ష్యంతో అయితే ఆవిర్భవించిందో ఆ లక్ష్యాన్ని కనుగుణంగా లక్ష్మీ పెరుమాళ్ళు బీద విద్యార్థులకు సహాయం చేయటం అభినందనీయమని అన్నారు. piwa మంగళగిరి బ్రాంచ్ ప్రధాన కార్యదర్శి గుత్తికొండ ధనుంజయరావు మాట్లాడుతూ.. పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించి 17 సంవత్సరాల కాలంలో దాదాపు 3 కోట్ల రూపాయలకు పైగా బీద విద్యార్థులకు, చేనేత కుటుంబాలకు సహాయ సహకారాలు అందించడం జరిగిందన్నారు. రాష్ట్రంలోని దాదాపు పది బ్రాంచ్ల ద్వారా పద్మశాలి చేనేత కుటుంబాలకు piwa సేవలందిస్తుందన్నారు. లక్ష్మీ పెరమాళ్ళు తను మొదటి నుంచి నిరుపేదలకు సహాయం చేయటంలో ముందు ఉంటారని అభినందించారు. బ్రాంచ్ ఉపాధ్యక్షులు గంజి రవీంద్రనాథ్ మాట్లాడుతూ నూతనంగా నిర్మితమవుతున్న piwa పద్మశాలి భవన్ కు మరింత మంది దాతల సహకారం అవసరమని దానిద్వారా ఇక్కడి నుంచి విస్తృత సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో మంగళగిరి టిట్కో హౌస్ కు చెందిన బిటెక్ చదివే కొల్లిపల్లవి, కుప్పరావు కాలనీ కి చెందిన బీటెక్ చదువు తున్న ఉడత జయశ్రీ లకు 50:000/- వేల రూపాయలు ఖరీదు చేసే రెండు లాప్టాప్లు అందజేశారు. మరియు బీటెక్ చదివే పంచుమర్తి కిరణ్ సాయి సిద్ధిక్ కు 15:000/- వేల రూపాయలు, బీటెక్ చదివే జంజనం ప్రియ నాగ ప్రత్యూష కు 15: 000/- వేల రూపాయలు, జూనియర్ ఇంటర్ చదివే ఊట్ల హిమమణి కంఠ కు 15:000/-వేల రూపాయలు, మరో విద్యార్థిని తుమ్మ తేజశ్రీ కి 11:000/- వేల రూపాయలు అందజేశారు.. ఈ కార్యక్రమంలో పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ మంగళగిరి బ్రాంచ్ సభ్యులు నందం బాబురావు, జొన్నాదుల బిక్షారావ్, ఆత్మకూరు పంచాయతీ బోర్డు మాజీ సభ్యులు శలా సత్యనారాయణ, జొన్నాదుల నాగమల్లేశ్వరరావు, తుమ్మ సర్వేశ్వరరావు, పంపన సాంబశివరావు,piwa ఆఫీస్ ఇంచార్జి శ్రీమన్నారాయణ,అలుగూరి రాజశేఖర్, నారాయణ సాంబశివరావు, పెనుమల్లి కార్తీక్, మైనంపాటి శ్రీ వాస్తవ, కేదాసి శ్రీనివాస్, తాటిపాముల రవి తదితరులు పాల్గొన్నారు