Download Post
4 months, 2 weeks
ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) స్కాలర్‌షిప్ స్కీమ్‌ను తీసుకొచ్చింది. గోల్డన్‌జూబ్లీ స్కాలర్‌షిప్ స్కీమ్ 2024 పేరిట తీసుకొచ్చిన పథకం ద్వారా ప్రతిభ కలిగిన విద్యార్థులకు నగదు ప్రోత్సహకం అందించనుంది. ఈ విషయాన్ని ఎల్‌ఐసీ స్వయంగా ‘ఎక్స్’ వేదికగా వెల్లడించింది. అర్హులు, దరఖాస్తు తేదీ పూర్తి వివరాలను అందులో పొందుపరిచింది.
2021-22, 2022-23, 2023 -24 విద్యా సంవత్సరాల్లో పదో తరగతి/ ఇంటర్మీడియట్/ డిప్లొమో లేదా తత్సమాన విద్యను పూర్తి చేసుకున్న వాళ్లు ఈ స్కాలర్ షిష్‌నకు అర్హులు. గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. లేదా సమానమైన సీజీపీఏ గ్రేడ్ కలిగి ఉండాలి. 2024 -25లో ఉన్నత విద్య చదవాలనుకొనే బాల, బాలికలకు జనరల్ స్కాలర్‌షిప్‌లు అందించనుంది. మెడిసిన్, ఇంజినీరింగ్, గ్రాడ్యుయేషన్, ఏదైనా విభాగంలో డిప్లొమో చేయాలనుకుంటున్నా, గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో వొకేషన్ కోర్సులు చేయాలన్నా, ఐటీఐ చదవాలనుకున్నా ఈ నగదు భరోసా కల్పిస్తారు. స్పెషల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకోవాలనే విద్యార్థినులు రెండేళ్ల పాటు స్కాలర్‌షిప్‌లు ఇస్తారు. పది పూర్తి చేసుకొని ఇంటర్మీడియట్/ 10+2/ ఏదైనా విభాగంలో డిప్లొమో కోర్సు పూర్తి చేయాలనుకొనే వారికి ఈ ప్రత్యేక ఉపకారవేతనానికి దరఖాస్తు చేసుకోవాలి. ఎల్‌ఐసీ www.licindia.in అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ఈ పథకానికి ధరఖాస్తు చేసుకోవచ్చు. ఎల్‌ఐసీ స్కాలర్‌షిప్ గడువు తేదీ డిసెంబర్ 22న ముగియనుంది. దరఖాస్తు ప్రక్రియ రేపటి (డిసెంబర్ 8) నుంచి ప్రారంభం కానుంది. కుటుంబ అర్హత, ఎంత మొత్తంలో స్కాలర్ షిప్ రానుంది.. వంటి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరిన్ని వివరాల కోసం ఎల్‌ఐసీ వెబ్‌సైట్‌ను సంప్రదించండి.