కర్నూల్ సివిల్ సప్లయస్ గోడౌన్ ఆకస్మిక తనిఖీ నిర్వహించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ కొంకతి లక్ష్మీనారాయణ.

Download Post





5 months, 1 week

కర్నూల్ సివిల్ సప్లయస్ గోడౌన్ ఆకస్మిక తనిఖీ నిర్వహించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ కొంకతి లక్ష్మీనారాయణ.


కర్నూల్ పట్టణం A.క్యాంపు నందుగల MLS గోడౌన్ ను ఈరోజు రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్  కొంకతి  లక్ష్మీనారాయణ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. తనిఖీ నందు గోడౌన్ ఇంచార్జ్ నాగమణితో కలిసి రికార్డులు పరిశీలించడం జరిగింది. 2023 ఫిబ్రవరి నుండి సీజ్ చేసిన రేషన్ బియ్యాన్ని 194 మెట్రిక్ టన్నులు పరిశీలించి వాటిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచించడం జరిగింది. పేదలకు సంబంధించిన నిత్యవసర సరుకులు సకాలంలో పంపిణీ జరిగేలా చూడాలని ఏమైనా అవకతవకాలకు పాల్పడితే సహించేది లేదని తెల్పడం జరిగింది. గత వైసిపి ప్రభుత్వం నిత్యవసర సరుకులు పంపిణీలో చాలా అక్రమాలు జరిగాయని విమర్శించడం జరిగింది.ప్రజలకు మా కూటమి ప్రభుత్వం బియ్యం బదులుగా మూడు కిలోల జొన్నలను తీసుకునే వేసులుబాటు  కల్పించింది.  అత్యంత తక్కువ ధరలకే పేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వందే అని చెప్పడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు,పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు,పౌరసరఫరాల చైర్మన్ తోట సుధీర్ గార్ల నేతృత్వంలో  రాష్ట్ర పౌరసరఫరాల శాఖను  బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.