Download Post
5 months, 3 weeks
తెలంగాణ రాష్ట్రంలో, రాష్ట్ర పద్మశాలి సంఘం ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటింగ్ ద్వారా ఎన్నుకోబడ్డ అధ్యక్షుడు వల్లకాటి రాజ్ కుమార్ బషీర్ బాగ్ (ప్రెస్ క్లబ్) లో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు.
అందులో భాగంగా మిర్యాలగూడ పట్టణానికి చెందిన పద్మశాలి నాయకుడు (రావిరాల శ్రీనివాస్) ను తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం రాష్ట్ర (మీడియా సెక్రెటరీగా) నియమిస్తూ ఉత్పరులు జారీ చేశారు. ఈ సందర్భంగా రావిరాల శ్రీనివాస్ మాట్లాడుతూ నా ఎన్నికకు సహకరించిన వల్లకాట్ రాజ్ కుమార్ కు తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు వీర మోహన్ కు మరియు మిర్యాలగూడ నియోజకవర్గ పద్మశాలి సంక్షేమ సంఘం కమిటీ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రంలో పద్మశాలీల అభ్యున్నతికై నిరంతరం తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది.