తెలంగాణ ఐక్య చేనేత వేదిక- రాష్ట్రం లో ఉన్న చేనేత వృత్తి సమస్యలు

Download Post





4 months, 3 weeks

💐 తెలంగాణ చేనేత ఐక్య వేదిక, రిజిస్టర్డ్ నెంబర్ 184 / 2023, హైదరాబాద్
ప్రెస్ రిలీజ్............,.2 డిసెంబర్ 2024


గౌ శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం గారికి హృదయ పూర్వక నమస్కారములు


సర్....
తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర కమిటీ పక్షాన రాష్ట్రం లో ఉన్న చేనేత వృత్తి సమస్యలు మీ దృష్టికి తీసుకు వస్తున్నాను. దయచేసి సహృదయులై మా వినతిని పరిశీలన చేసి అమలు చేయాలని కోరుతూ ఉన్నాను.
➡️ చేనేత కార్మికులకు గత ప్రభుత్వం అమలు చేసిన చేనేత మిత్ర పథకాన్ని పునరుద్ధరణ చేయాలి
ఇది నవంబర్ 2023 నుండి నిలిచిపోయింది.మగ్గం నేసే వారికి నెలకు @ 2 వేలు అనుబంధ కార్మికునికి @ 1 వేయి లభించేది
➡️ గత ప్రభుత్వం అమలు చేసిన నేతన్నకు చేయూత త్రిఫ్టు ఫండ్ పథకం పునరుద్ధరించాలని కోరుతూ ఉన్నాను
➡️ చేనేత మర నేత కార్మికులకు వర్క్ షెడ్స్ నిర్మించి ఇవ్వాలి
➡️ ప్రభుత్వం ప్రకటించిన చేనేత కార్మికుల ఋణ మాఫిని వెంటనే అమలు చేయాలని కోరుతూ ఉన్నాను.
➡️ రాష్ట్రం లోని చేనేత సహకార సంఘాలకు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఎన్నికలు నిర్వహించాలి.
➡️ యాభై ఏళ్లు దాటిన చేనేత కళాకారులకు వృద్ధాప్య పెన్షన్స్ మంజూరు చేయాలని కోరుతూ ఉన్నాను.
➡️ రాష్ట్రం లో జియో టాగ్ విధానం ఎత్తివేయాలి.
➡️ రాష్ట్రం లోని అన్ని జిల్లా కేంద్రాల్లో టెస్కో షోరూమ్స్ అన్ని హంగులతో సరికొత్త రీతిన ఏర్పాటు చేయాలని కోరుతూ ఉన్నాను
➡️ రాష్ట్రం లోని అన్ని జిల్లా కేంద్రాల్లో పద్మశాలి జాతి పిత
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేయాలని కోరుతూ ఉన్నాను
➡️ నూలు సబ్సిడీ విధానం సరళ తరం చేయాలి
➡️ ప్రతి పద్మశాలి కి నేతన్న భీమా వర్తింప చేయాలి
➡️ అసువులు బాసిన చేనేత కుటుంబాలకు ప్రతి ఒక్కరికీ @ 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయాలి
➡️ రాష్ట్రం లో నిల్వ ఉన్న చేనేత వస్త్రాలను ప్రభుత్వం వెంటనే ఖరీదు చేయాలి
వీటిని మీ పరిశీలనకు అందిస్తున్నాను. దయచేసి సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను.
___
రాపోలు వీర మోహన్ బి కాం
     అధ్యక్షులు
తెలంగాణ చేనేత ఐక్య వేదిక
హైదరాబాద్ 9866477255