తెలుగుదేశం నేత,మంగళగిరి శివాలయం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ దామర్ల శివరామకృష్ణ మృతి.

Download Post





5 months

తెలుగుదేశం నేత,మంగళగిరి శివాలయం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ దామర్ల శివరామకృష్ణ మృతి....
""""""""""'''''"""""""""""""""""""
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మంగళగిరి శివాలయం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ దామర్ల శివరామకృష్ణ ( 87) ది 25-11-2024 సోమవారం ఉదయం విజయవాడలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గోలి వారి వీధిలో ,దామర్ల శివరామకృష్ణ గారు  మంగళగిరి శివాలయం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్గా శివాలయం అభివృద్ధికి తోడ్పడ్డారన్నారు. మంగళగిరి తెనాలి రోడ్ లోని శ్రీ మార్కండేయ పద్మశాలి కళ్యాణమండపాల ప్రధాన కార్యదర్శిగా,అఖిల భారత భక్త మార్కండేయ అన్న సత్రం తిరుచానూరు తిరుపతి కమిటీ ఉపాధ్యక్షులుగా,2008లో ప్రారంభించిన పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ కేంద్ర కమిటీ సభ్యులుగా సేవలందించారనితన సతీమణి రామ సీతమ్మ మృతి చెందటంతో ఒక కోటి 60 లక్షల కార్పస్ పండుతో దామర్ల శివరామకృష్ణ రామ సీతమ్మ  పేరిట సేవా ట్రస్టు ఏర్పాటుచేసి అనేక సంవత్సరాలుగా పేదలకు అనేక సేవా కార్యక్రమాలు ప్రతి ఏటా నిర్వహిస్తు సంఘంలో ఒక మంచి సేవా తత్పరులుగా పేరు తెచ్చుకున్నారన్నారు...*పద్మశాలి కమ్యూనిటీలో అభివృద్ధిని కోరే ఒక మంచి వ్యక్తిత్వం గల శివరామకృష్ణగారు ..దామర్ల శివరామకృష్ణ గారికి ఘన నివాళి అర్పిస్తూ..వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ...వారి కుటుంబసభ్యులకు పద్మశాలి కమ్యూనిటీ సానుభూతి తెలిపారు...