Download Post
4 months, 2 weeks
పేద పద్మశాలి విద్యార్థికి అండగా ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన
ల్యాప్ టాప్ అందజేసిన యువసేన ప్రతినిధులు
రాష్ట్రంలో ఏ పద్మశాలి కుటుంబానికి కష్టమొచ్చినా మేమున్నామంటూ ముందుకొచ్చి సహాయ కార్యక్రమాలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన(APPYS) ఒక పేద విద్యార్థి చదువుకు అండగా నిలిచింది. పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం లగడపాడుకు చెందిన అనుముల రామకృష్ణ గుంటూరులోని హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ లో బీటెక్ చదువుతున్నాడు. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు కావడంతో చదువుకోవడానికి ల్యాప్ టాప్ లేక ఇబ్బంది పడుతున్నాడు. వారి బంధువులు విద్యార్థి సమస్యను ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన (APPYS) దృష్టికి తీసుకొచ్చారు. యువసేన ప్రతినిధులు రాష్ట్రవ్యాప్తంగా విరాళాలు సేకరించారు. రూ.43 వేలు విలువైన ల్యాప్ టాప్ కొనుగోలు చేసి విద్యార్థికి అందించారు. మంగళగిరికి చెందిన పద్మశాలీ బంగారు వ్యాపారులు కూడా ఈ సేవా కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా యువసేన ప్రతినిధులు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా యువసేన సేవా కార్యక్రమాలు చేపడుతుందని చెప్పారు. అదే విధంగా యువసేన బలోపేతానికి ప్రతి గ్రామం నుంచి సేవాభావం కలిగిన పద్మశాలి యువకులు యువసేనతో కలసి రావాలని కోరారు. అప్పుడే ఆర్థికంగా వెనుకబడిన పద్మశాలి కుటుంబాలకు అండగా నిలబడగలమని చెప్పారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన (APPYS) ప్రతినిధులు గోపిశెట్టి రామాంజనేయులు ఋషి, మునగపాటి రమేష్, పెనుగొండ శ్రీనివాసరావు, గోలి వంశీకృష్ణ, మునగాల గిరిధర్, శీరపు దుర్గాప్రసాద్, కప్పాల లక్ష్మణ్, తెడ్లపు అప్పారావు, బొడ్డు శ్రీనివాసరావు, సింగానమల నారాయణ, చదుళ్ల రంగనాథ్, ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ మునగపాటి వెంకటేశ్వరరావు, గుంటూరు జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షులు పారేపల్లి మహేష్, స్వర్ణకార సంఘం రాష్ట్ర పీఆర్వో కొడాలి నాగమల్లేశ్వరరావు, పద్మశాలి సంఘం రాష్ట్ర నాయకులు గుంటి నాగరాజు, పద్మశాలి ప్రముఖులు పడవల కోటేశ్వరరావు, పడవల రాజశేఖర్, బట్టు శ్రీనివాసులు, జింకా దివ్యనారాయణ, బిట్రా శ్రీను, పున్నం నగేష్, తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన (APPYS) చేపట్టే సహాయ కార్యక్రమాలను ప్రశంసించారు. భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలకు తమ సహకారం అందిస్తామని తెలిపారు.