తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపి డంకా మెాగించాలి...బీజేపీ సీనియర్ నాయకులు పోనగంటి భాస్కర్

Download Post





1 day, 15 hours

తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపి డంకా మెాగించాలి... పోనగంటి భాస్కర్

ఈరోజు సాయంత్రం తిరుపతి లో ఉన్న నార్త్ మండల సమావేశం అధ్యక్షులు పగడాల ప్రభాకర్ నాయుడు గారి అధ్యక్షతన జరిగింది.   

ఈ సమావేశం నకు ముఖ్య అతిథిగా బిజెపి సీనియర్ నాయకులు నార్త్ మండల ఇన్ చార్జ్ పోనగంటి భాస్కర్ గారు పాల్గొని సమావేశంను ఉద్దేశించి మాట్లాడుతూ, నార్త్ మండలంలో పార్టీ సంస్థాగత బలోపేతానికి చేపట్టాల్సిన కార్యాచరణ, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో బిజెపి విజయభేరి మోగించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు.
అలాగే సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని నార్త్ మండలం  వ్యాప్తంగా 'సేవా పఖ్వాడా' (సేవా సంకల్ప) కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు. 

పార్టీలోని ప్రతి పదాధికారి, కార్యకర్త సేవాభావంతో భూత్ స్దాఈలో ప్రజల వద్దకు వెళ్లి,అమ్మ పేరు తో ఓక చెట్టు, పరిసరాలు శుభ్రత,స్వచ్ఛభారత్ పేదవాళ్ళుకు ,వృద్ధులు కు పండ్లు, పంచటం చేయాలని కోరారు. 
  కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను మరియు బిజెపి సిద్ధాంతాలను విస్తృతంగా ప్రచారం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రతి శక్తి కేంద్ర లో మన జండా ఏగరేసే కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని పోనగంటి భాస్కర్ కోరారు. 

ఈ సమావేశంలో తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ కర్తల మండలి సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి గారు, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి జల్లి మధుసూదన్ గారు, బిజెపి సీనియర్ నాయకులు రాటకోండ విశ్వనాథ్ గారు, నరసింహ యాదవ్ గారు, మండల , జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About The Author

CLASSIFIEDS