ప్రగడ కోటయ్య గారి వర్ధంతి సందర్భంగా నివాళులు

Download Post





5 months

ఈ రోజు అనకాపల్లి జిల్లాలో శ్రీ భధ్రావతి వీవర్స కో ఆపరేటివ్ ప్రొడక్షన్ అండ్ సేల్సు సోసైటీ లిమిటెడ్ నెంబర్ యమ్ 688/1947 యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం

సోసైటీ పరిధిలో ప్రగడ కోటయ్య గారి 29.వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు ఈ యొక్క కార్యక్రమంలో AIWF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు ఆంద్రప్రదేశ్ పధ్మశాలీ సంఘం రాష్ట్ర కన్వీనర్ పప్పు రాజారావు గారు,అనకాపల్లి జిల్లా, చేనేత వింగ్స్ విభాగం అధ్యక్షులు మాడెం సూరి అప్పారావు, సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు
                         ఇట్లు
            అనకాపల్లి జిల్లా ,చేనేతలు

జీవితాంతం పేద ప్రజల అభ్యున్నతికి అవిశ్రాంత పోరాటం చేసిన మానవతావాది శ్రీ ప్రగడ కోటయ్య గారు. ముఖ్యంగా చేనేత రంగ అభివృద్ధికి స్ఫూర్తివంతంగా పనిచేసిన పెద్దలు శ్రీ ప్రగడ కోటయ్య గారి వర్ధంతి నేడు. రైతు బాంధవ్యుడు ప్రొఫెసర్ ఎన్జీ రంగా గారి శిష్యులు వీరు. మద్రాసులో టెక్ష్ టైల్ కళాశాలలో శిక్షణ పొంది చేనేత సహకార రంగంలో ఉద్యోగంలో చేరి సహకార రంగ అభివృద్ధికి కృషి చేశారు. చేనేత వాణి అనే వారపత్రిక ద్వారా చేనేతల సమస్యలను రాష్ట్రమంతటా వినిపించారు. 1952 నుండి 1990 వరకు శాసనసభలో, శాసనమండలిలో, రాజ్యసభలో సభ్యులుగా పనిచేశారు.నాటి ప్రజా సమూహం వీరిని ప్రజా బంధువు అను బిరుదుతో డాక్టర్ బెజవాడ గోపాల రెడ్డి గారి చేతుల మీదుగా సన్మానించారు. దేశంలో చేనేత పరిశ్రమ అభివృద్ధి కోసం ఎన్నో సూచనలు,సలహాలు ఇవ్వడంతో పాటు అనేక రాష్ట్రాలలో చేనేత సమస్యల మీద పోరాటం చేశారు. చేనేత కార్మికులందరికీ సరిపోయేటంత నూలు సరఫరా చేయాలని నూలు ధరలు అదుపులో ఉంచడానికి నూలు మిల్లులు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు అవ్వడానికి కారణం వీరే. చేనేత పితామహులుగా, ప్రజాబంధు శ్రీ ప్రగడ కోటయ్య గారి ఆశయాలు ఆదర్శాలు నెరవేరేలాలా ప్రభుత్వం పని చేయడమే వారికి మనం ఇచ్చే నిజమైన నివాళి.
 మానవతావాది ,
 ప్రజా బంధువు ,
 చేనేత పితామహుడు
క్రీస్తు శేషులు
 ప్రగడ కోటయ్య గారి
వర్ధంతి సందర్భంగా  నివాళులు తెలియ చేస్తున్న
మీ
కప్పల రామారావు పద్మశాలి,
పూసపాటి రేగ,
విజయనగరం జిల్లా.