Download Post
5 months, 2 weeks
పద్మశాలీల ఐక్యత వర్థిల్లాలీ
ఐక్యమత్యమే మహ బలం
🌼శ్రీ భధ్రావతి భావనారాయణ దేవస్థానంలో వనభోజన మహోత్సవ కార్యక్రమ సమాలోచన సమావేశం🌼
గ్రామం: మోరగుడి
తేదీ:08.11.2024 సాయంత్రం 6.00గంటలకు మొదలై 9.00 గంటలకు ముగిసింది.
విషయం: కార్తీక మాసంలో వన భోజన కార్యక్రమం ఏర్పాటు చేసుకునే అంశంపై మోరగుడి పద్మశాలీ కుల భాంధవుల సమాలోచన సమావేశం .
ఈ సమావేశంలో దేవస్థానం కమిటీ సభ్యులు మాట్లాడుతూ కార్తీక వనభోజన కార్యక్రమం మన దేవస్థానం ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్న కుల భాంధవులతో చేసుకోవాలని అనుకుంటున్నామని కుల భాంధవుల సలహ సూచనలు చేయమని తెలపడం జరిగింది..
ఈ విషయం పై సమావేశానికి హాజరైన అందరూ మాట్లాడుతూ మంచి ప్రాధాన్యత ఉన్న కార్యక్రమం కాబట్టి అందరం ఆమోదం తెలుపుతున్నామని అయితే గ్రామంలో కుల భాంధవులు, దేవస్థానం కమిటీ సభ్యులు అందరం ఐక్యంగా ఉంటే బయటి వ్యక్తులు వచ్చి దేవస్థానం కమిటీ సభ్యులు అనుమతి లేకుండా ఎటువంటి కార్యక్రమాలు చేయడానికి సాహసాలు చేయలేరు కాబట్టి మన దేవస్థానం ఆధ్వర్యంలో మైలవరం జలాశయం వెనక భాగంలో ఆహ్లాదకరమైన కొండ ప్రాంతాల్లో వెలసిన త్రిమూర్తుల కోనలో నవంబర్ నెల 18.11.2024 అనగా కార్తీక సోమవారం వన భోజన కార్యక్రమం నిర్వహించాలని సమావేశానికి హజరైన అందరూ తీర్మానం చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మోరగుడి దేవస్థానం తో పాటు గూడెం చెరువు పద్మశాలీ బహుత్తమ సంఘం వారు కూడా మద్దతు తెలిపారు.అలాగే 08.11.2024.తేదీన తీర్మానం చేసిన విధంగా వన భోజనాలు ఏర్పాటు చేసే పుణ్యక్షేత్రాన్ని 09.11.24 ఉదయం మోరగుడి దేవస్థానం కమిటీ సభ్యులతో కలిసి గూడెం చెరువు కమిటీ సభ్యులు మరియు కుల భాంధవులు పరిశీలించారు.
జై మార్కండేయ, జై పద్మశాలీ..