Download Post
1 day, 9 hours
తిరుపతి లో ఘనంగా యెాగాంధ్ర డే...
12 వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని, మన యన్ డి ఎ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'యోగాంధ్ర' కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం తిరుపతి లోని తారకరామా స్టేడియం నందు నిర్వహించిన ప్రత్యేక యోగా సాధనలో తిరుపతి జిల్లా కలెక్టరు వెంకటేశ్వర్లు గారు, తిరుపతి జిల్లా యస్ పి సుబ్బ రాయుడు గారు, తిరుపతి మాజీ శాసన సభ్యులు, తెలుగు దేశం పార్టీ తిరుపతి అసెంబ్లీ ఇన్ చార్జ్ శ్రీమతి మున్నూరు సుగుణమ్మ గారు, బిజెపి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ గారు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపు లేటి హరి ప్రసాద్ గారు, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ ఉప కమీషనర్ అమరయ్య గార్లు లతో కలిసి పోనగంటి భాస్కర్ గారు స్వయంగా పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా అక్కడికి విచ్చేసిన కూటమి నాయకులు, కార్యకర్తలు, పురపాలక అధికారులు, యోగా ప్రేమికులు మరియు పట్టణ ప్రజలతో కలిసి యోగాసనాలు వేశాను.
మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి యోగా ఎంతో ఉత్తమమైన మార్గం.
ప్రతి ఒక్కరూ తమ నిత్య జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకుని, సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని ఈ సందర్భంగా కోరుకున్నాను.
ఉత్సాహంగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంతటి ఘన విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ పోనగంటి భాస్కర్ గారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు... 🙏
#yogaday
# Ponaganti Bhaskar
# Tirupati
#AndhraPradesh