Download Post
1 day, 3 hours
దోమల్ని తరిమే నూనెలివి...
ఆహారవ్యర్థాలు, తేమ, నిలిచిన నీరు, గాలి ప్రసరణ సరిగా లేకపోవడం ఇలా ఎన్నో కారణాల వల్ల బొద్దింకలు, పురుగులు ఇంట్లో చేరుతుంటాయి. వీటిని సహజంగా సులువుగా తరిమేయాలంటే...
* పావుకప్పు ఆవనూనెలో,
ఐదారు పుదీనా ఆకులు వేసి మరగనివ్వాలి. ఆ మిశ్రమాన్ని వడకట్టి ఓ సీసాలో పోసుకోవాలి. ఇప్పుడు గ్లాసు నీళ్లలో అరచెంచా ఈ నూనెను కలిపి వంటగది
మూలల్లో స్ప్రే చేయండి. కొన్ని రోజులు ఇలా చేస్తే బొద్దింకలు దరిచేరవు.
* వేప నూనె సహజ క్రిమి సంహారిణిగా పనిచేస్తుంది.
పావులీటరు నీటిలో చెంచా వేపనూనె, అరచెంచా వంట సోడా కలపాలి. దాన్ని అవసరమైన చోట స్ప్రే చేయండి. పావుగంట తర్వాత దోమలే కాదు... చిన్న చిన్న పురుగులు. కూడా పోతాయి. ఇక, బొద్దింకలు పోవాలంటే... నిమ్మ చెక్కపై కాస్తవేప నూనె అద్ది... సింకుల కింద, మురికి నీళ్ల గొట్టాలు, తలుపు మూలల్లో పెడితే సరి. వాటికి అడ్డుకట్ట వేయొచ్చు.
* నిమ్మగడ్డి నూనె ఘాటైన వాసనకు బొద్దింకలు పరారవుతాయి. లీటరు నీటిలో కాస్త బేకింగ్ సోడా, నాలుగైదు చుక్కల నిమ్మగడ్డి నూనెను కలిపి... వంటింటి గట్టు, గోడలు తుడవండి. మూలల్లో స్ప్రే చేయండి.
నరాల బలహీనతకు ఇంటి వైద్యాలు కొన్ని:
1. బాదం నూనె: బాదం నూనెను తీసుకొని నరాలపై మసాజ్ చేయడం వలన నరాల బలహీనత తగ్గుతుంది.
2. ఆముదం నూనె: ఆముదం నూనెను నరాలపై మసాజ్ చేయడం వలన నరాలు బలపడతాయి.
3. అలసందలు: అలసందలను తినడం వలన నరాల బలహీనత తగ్గుతుంది.
4. ఆటవిటమిన్లు: విటమిన్ B, E, D కలిగిన ఆహారాలు తీసుకోవడం వలన నరాలు బలపడతాయి.
5. నిద్ర: సరైన నిద్ర తీసుకోవడం వలన నరాల బలహీనత తగ్గుతుంది.
6. వ్యాయామం: సాధారణ వ్యాయామం చేయడం వలన నరాలు బలపడతాయి.
7. తేనె: తేనెను తినడం వలన నరాల బలహీనత తగ్గుతుంది.
ఇవి కొన్ని సాధారణ సూచనలు మాత్రమే. సమస్య తీవ్రంగా ఉంటే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.